Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: సూపర్ మ్యాన్ ఒలివర్.. ఇంగ్లండ్‌కు షాకిచ్చి ఫ్రాన్స్‌ను సెమీఫైనల్ చేర్చిన సూపర్ స్టార్!

FIFA World Cup 2022: Oliver Girouds winner takes France beat England to enter semis

దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం అర్దరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను సెమీస్ చేరకుండానే మాజీ చాంపియన్ ఫ్రాన్స్ ఇంటిదారి పట్టించింది. ఫ్రాన్స్ స్టార్ ఒలివర్ గిరౌడ్ కీలక సమయంలో గోల్ కొట్టిన ఫ్రాన్స్ విజయానికి బాటలు వేసాడు. 78వ నిమిషంలో అంటోని గ్రిజ్‌మన్‌ నుంచి క్రాస్‌ అందుకున్న ఒలివర్‌ గిరౌడ్‌ అద్భుత రీతిలో గోల్‌ కొట్టి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని డబుల్ చేసాడు. మరో గోల్ అరిలియన్ చోవమిని(17) అందించగా.. ఇంగ్లండ్ తరఫున హరీ కేన్(54వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు.

ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. 17వ నిమిషంలో ఆంటోని గ్రిజ్‌మెన్‌ నుంచి పాస్‌ అందుకున్న అరెలియన్‌ చౌమెనీ అద్భుతంగా గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌ శిబిరంలో సంతోషం నింపాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్నా.. ఫ్రాన్స్ డిఫెన్స్ సమర్ధవంతంగా అడ్డుకుంది. దాంతో ఫస్టాఫ్ 1-0తో ముగిసింది.

ఇక సెకండాఫ్ ఫ్రారంభమైన వెంటనే ఇంగ్లండ్ గోల్ నమోదు చేసింది. 54వ నిమిషంలో లభించిన పెనాల్డీని హరీ కేన్ గోల్‌గా మలిచాడు. దాంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఇరు జట్ల డిఫెన్స్ విభాగం సమర్ధవంతంగా ఉండటంతో మ్యాచ్ షూటౌట్‌కు దారి తీస్తుందా? అనిపించింది. కానీ 78వ నిమిషంలో ఒలివర్ గోల్ కొట్టి ఫ్రాన్స్ హీరోగా అవతరించాడు. ఈ గోల్‌తో 2-1 ఆధిక్యాన్ని అందించాడు.

ఈ క్రమంలో 84 నిమిషాల వద్ద ఇంగ్లండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. అయితే తొలి పెనాల్టీని గోల్‌గా మలిచిన హారీ కేన్‌ రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి గోల్‌పోస్ట్‌ పై నుంచి వెల్లడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయినా చివరి వరకు ప్రయత్నం చేసినప్పటికీ బ్రిటీష్‌ జట్టు మరో గోల్‌ చేయలేక ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్లోఫ్రాన్స్.. మొరాకోతో తలపడనుండగా.. క్రొయేషియాతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Sunday, December 11, 2022, 8:45 [IST]
Other articles published on Dec 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+