న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022: క్వార్టర్స్‌కు నెదర్లాండ్స్.. ఇంటికి అమెరికా!

FIFA World Cup 2022: Netherlands beat USA 3-1, progress to the quarter-finals

అల్ రయాన్: ఫిఫా ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. అమెరికా కథ మరోసారి ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. శనివారం జరిగిన తొలి ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3-1తో అమెరికాను చిత్తు చేసింది. నెదర్లాండ్స్ తరఫున మెంఫిస్‌ డిపే (10వ నిమిషం), డాలీ బ్లైండ్‌ (45+1 నిమిషం), డెంజల్‌ డమ్‌ఫ్రైస్‌ (81వ నిమిషం) గోల్స్‌ చేయగా.. అమెరికా తరఫున హజీ రైట్‌ (76వ నిమిషం) ఏకైక గోల్‌ సాధించాడు. రెండు గోల్స్‌కు బాటలు వేసిన డమ్‌ఫ్రైస్‌.. మూడో గోల్‌ చేసి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చా డు.

మ్యాచ్‌ ఆరంభమైన మూడో నిమిషంలోనే అమెరికా స్టార్‌ ఫులిసెక్‌కు సువర్ణావకాశం లభించింది. కానీ, అతడు కొట్టిన కిక్‌ను డచ్‌ కీపర్‌ నోపర్‌ అడ్డుకొన్నాడు. కానీ, క్రమంగా ఒత్తిడి పెంచిన నెదర్లాండ్స్ 10వ నిమిషంలో మెంఫిస్‌ డిపే గోల్‌తో పైచేయి సాధించింది. డమ్‌ఫ్రైస్‌ ఇచ్చిన లోపాస్‌ను డిపే నేరుగా గోల్‌లోకి కొట్టాడు. ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నించినా.. డచ్‌ డిఫెన్స్‌ను ధాటుకోలేకపోయింది.
మ్యాచ్‌ సాగేకొద్దీ బంతిని ఎక్కువగా తమ అధీనంలోనే ఉంచుకొన్న నెదర్లాండ్స్‌.. అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది. ఫస్టాఫ్‌ స్టాపేజ్‌ (45+1) టైమ్‌లో మరో గోల్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది.

ఈసారి డమ్‌ఫ్రైస్‌ పాస్‌ను బ్లైండ్‌ నెట్‌లోకి పంపడంతో నెదర్లాండ్స్‌ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, సెకండాఫ్‌లో అమెరికన్లు దూకుడు పెంచినా.. నెదర్లాండ్స్‌ను వణికించేంత రీతిలో సాగలేదు. ఆరంభమైన ఐదు నిమిషాలకే డచ్‌ ప్లేయర్‌ డమ్‌ఫ్రైస్‌ గోల్‌ చేసినంత పని చేశాడు. యూఎస్‌ పెనాల్టీ ఏరియాలో అతను కొట్టిన కిక్‌ను జిమ్మర్‌మెన్‌ ఆపే ప్రయత్నంలో తడబడినా.. కీపర్‌ టర్నర్‌ లిప్తపాటులో బంతిని అడ్డుకున్నాడు. అయితే, 75వ నిమిషంలో అమెరికా గోల్‌ చేసింది. ఫులిసెక్‌ క్రాస్‌.. రైట్‌ కాలికి తగిలి గోల్‌లో పడింది. ఇదే జోరులో యూఎస్‌ మరిన్ని దాడులు చేసినా.. 81వ నిమిషంలో బ్లైండ్‌ ఇచ్చిన క్రాస్‌ను డమ్‌ఫ్రైస్‌ గోల్‌లోకి పంపడంతో నెదర్లాండ్స్‌ 3-1తో నిలిచింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటూ ముందంజ వేసింది.

Story first published: Sunday, December 4, 2022, 8:37 [IST]
Other articles published on Dec 4, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X