Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: ఆతిథ్య ఖతార్ ఖేల్ ఖతం.. సెనెగల్ చేతిలో చిత్తు!

FIFA World Cup 2022: Host nation Qatar eliminated after second defeat

దోహా: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన ఆతిథ్య ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో సెనెగల్ 3-1తో ఖతార్‌ను చిత్తు చేసింది. స్ట్రైకర్ బౌలయో దియా 41వ నిమిషంలో సెనెగల్‌కు తొలి గోల్ అందించగా.. ఫమారా(48వ నిమిషం) ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. 78వ నిమిషంలో ముంటారి గోల్ చేసి 1-2తో ఖతార్‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే బంబాడియెంగ్ సెనెగల్‌కు మూడో గోల్ అందించి ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించాడు.

ఈ ఓటమితో ఖతార్‌ జట్టు ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. శుక్రవారం నెదర్లాండ్స్‌- ఈక్వెడార్‌ జట్ల మధ్య జరిగిన గ్రూప్‌ 'ఎ' పోరు డ్రా కావడంతో ఆతిథ్య జట్టు మరో మ్యాచ్‌ ఉండగానే ఇంటిదారి పట్టింది. నాలుగు జట్ల గ్రూపులో నెదర్లాండ్స్‌, ఈక్వెడార్‌ చెరో నాలుగేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. సెనెగల్‌ (3) మూడో స్థానంలో ఉండగా, ఖతార్‌ (0) అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆతిథ్య దేశంగా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన ఖతార్ నాకౌట్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇది ఆదే అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది.

FIFA World Cup 2022: Host nation Qatar eliminated after second defeat

నెదర్లాండ్స్‌-ఈక్వెడార్‌ మ్యాచ్‌లోనూ ఊహించని ఫలితం వచ్చింది. పెద్ద జట్టయిన నెదర్లాండ్స్‌ సులువుగా మ్యాచ్‌ గెలిచేస్తుందని అనుకుంటే.. ఈక్వెడార్‌ అంత తేలిగ్గా లొంగలేదు. దీంతో ఆ జట్టుతో గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 1-1 డ్రాతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. సెనగల్‌పై గత మ్యాచ్‌లో చక్కటి హెడర్‌ గోల్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గాక్పో ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటుతూ ఆరో నిమిషంలోనే గోల్‌ కొట్టడంతో నెదర్లాండ్స్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

FIFA World Cup 2022: Host nation Qatar eliminated after second defeat

ఆ తర్వాత కూడా ఆ జట్టు గోల్‌ దాడులు కొనసాగించినా.. ఆధిక్యం మాత్రం పెరగలేదు. ద్వితీయార్ధం మొదలవగానే ఈక్వెడార్‌ పెద్ద షాకే ఇచ్చింది. ఖతార్‌తో తొలి మ్యాచ్‌లో డబుల్‌ గోల్‌తో అదరగొట్టిన వాలెన్సియా.. మళ్లీ ఈక్వెడార్‌ జట్టులో హీరోగా మారాడు. 49వ నిమిషంలో అతను కొట్టిన గోల్‌తో స్కోరు సమం కావడంతో డచ్‌ జట్టు షాక్‌కు గురైంది. ఆ తర్వాత ఆధిక్యం కోసం నెదర్లాండ్స్‌ తీవ్రంగా ఫలించినా ఫలితం లేకపోయింది. సమష్టిగా కదిలిన ఈక్వెడార్‌ ఆటగాళ్లు ఆ జట్టుకు గెలుపు గోల్‌ దక్కకుండా అడ్డుకున్నారు.

Story first published: Saturday, November 26, 2022, 8:48 [IST]
Other articles published on Nov 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+