For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FIFA World Cup 2022: ప్రెస్‌మీట్‌కు రాలేదని జర్మనీ టీమ్‌కు భారీ జరిమానా!

FIFA World Cup 2022: FIFA Fines Germany for Refusing to Send a Player in Pre-Match Press Conference

దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022లో మరో వివాదం చర్చనీయాంశమైంది. ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్‌కు రాలేదని జర్మనీ జట్టుకు ఫిఫా నిర్వాహకులు భారీ జరిమానా విధించాడు. స్పెయిన్‌తో మ్యాచ్‌కు ముందు జర్మనీ ప్రెస్ మీట్‌కు హాజరు కాకపోవడంతో నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది. ఇది ఫిఫా నిబంధనలను ఉల్లంఘించడమేనని భావించిన నిర్వాహకులు జర్మనీ జట్టుకు పది వేల స్విస్ ఫ్రాన్సెస్(సుమారు రూ.8.5 లక్షలు) ఫైన్ వేసారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. కొందరూ ఫిఫా చర్యలు తప్పుబడుతుంటే మరికొందరు మాత్రం సమర్ధిస్తున్నారు.

గ్రూప్-ఈలో ఉన్న జర్మనీ.. ఈ నెల 28న స్పెయిన్ తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు జర్మనీ నుంచి ఒక్కరూ రాలేదు. ఆ జట్టు ఆటగాళ్లు, హెడ్ కోచ్, మేనేజర్, కోచింగ్ సిబ్బంది ఎవరూ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేదు. అయితే జర్మనీ హెడ్ కోచ్ హన్సి ఫ్లిక్ మాత్రం తాము మ్యాచ్ మీద ఫోకస్ పెట్టామని, అందుకే ప్లేయర్లందరూ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారని తెలిపాడు. అయితే తుది జట్టు ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేసుకున్నా ఎవరినో ఒకరిని పంపించి ఉంటే అయిపోయేదని, సుమారు 25 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, మేనేజర్లు ఉన్నా వారిలో ఒక్కరు కూడా ఖాళీగా లేరా..? అని ఫిఫా వారిని ప్రశ్నించింది.

ఇక ఈ టోర్నీలో గ్రూప్ - ఈ లో ఉన్న జర్మనీ రెండు మ్యాచ్ లు ఆడింది. తమ తొలి మ్యాచ్ లో జపాన్ చేతిలో ఓడిన జర్మనీ.. రెండో మ్యాచ్ లో స్పెయిన్ తో డ్రా చేసుకుంది. డిసెంబర్ 2న ఆ జట్టు కోస్టారికాతో గ్రూప్ చివరి మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ - 16 చేరాలంటే జర్మనీకి ఈ మ్యాచ్ లో గెలవడం చాలా కీలకం. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న జర్మనీ రెండో రౌండ్ కు చేరుతుందా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటి వరకు రౌండ్ - 16 చేరిన జట్లు..

- ఫ్రాన్స్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, సెనగల్, ఇంగ్లాండ్, యూఎస్ఎ

అధికారికంగా ఎలిమినేట్ అయిన జట్లు ..

- ఈక్వెడార్, ఖతర్, ఇరాన్, వేల్స్, కెనడా

Story first published: Wednesday, November 30, 2022, 20:33 [IST]
Other articles published on Nov 30, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+