Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: వీ వాంట్ బీర్.. మైదానం దద్దరిల్లేలా ఈక్వెడార్ అభిమానుల నినాదాలు! (వీడియో)

 FIFA World Cup 2022: Ecuador fans chanted We want beer at the opening match against Qatar

అల్ ఖోర్: క్రీడా ప్రపంచం వేయి కండ్లతో ఎదురు చూసిన సాకర్​ కిక్కు షురూ అయింది. ఖతార్‌‌‌‌‌‌ గడ్డపై ప్రపంచ నేతల ముంగిట.. వేలాది మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో ఖతర్నాక్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీతో ఆదివారం రాత్రి ఫిఫా వరల్డ్​ కప్​ మొదలైంది. వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఆర్టిస్టులతో పాటు అరబ్‌‌‌‌ కంట్రీ సంస్కృతి ఉట్టి పడే పెర్ఫామెన్స్‌‌‌‌లు, లేజర్‌‌‌‌ లైటింగ్, బాణాసంచా మోతతో అల్‌‌‌‌ బయత్‌‌‌‌ స్టేడియంలో ఆరంభ వేడుకలు అంబరాన్ని అంటాయి.
ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2022 పోటీలు ప్రారంభమయ్యాయి.

ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఖతార్‌పై ఈక్వెడార్‌ 2-0 తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ చరిత్రలో ఆతిథ్యం ఇచ్చిన దేశం తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. దాదాపు 70వేల సీటింగ్‌ కెపాసిటీ కలిగిన ఆల్‌ బయత్‌ స్టేడియంలో ఎక్కువ మంది ఖతార్‌ అభిమానులే ఉన్నారు. అయినా ఈక్వెడార్‌పై విజయం సాధించడంలో ఖతార్‌ విఫలమైంది.

మ్యాచ్‌ ముగింపు దశకు వచ్చేసరికి చాలా మంది ఖతార్‌ అభిమానులు సీట్లను వదిలి వెళ్లిపోయారు. అయితే ఈక్వెడార్‌ అద్భుత విజయం సాధించడంతో ఆ జట్టు ఫ్యాన్స్‌ సంబరాలు అంబరాన్ని తాకాయి. 'వీ వాంట్ బీర్‌' అంటూ ఈక్వెడార్‌ అభిమానులు మైదానం దద్దరిల్లేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలి మ్యాచ్‌లోనే తమ జట్టు విజయం సాధించిందని, అందుకే తమకు బీర్‌ కావాలంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేశారు. అయితే స్టేడియం పరిసరాల్లో ఆల్కహాల్ ఉత్పత్తుల అమ్మకాలపై ఫిఫా ప్రపంచకప్‌ నిర్వాహకులు నిషేధించిన విషయం తెలిసిందే. దోహా, దుబాయ్‌లో మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసిన ఫిఫా ఫ్యాన్‌ ఫెస్టివల్‌ ప్రాంతాల్లో మాత్రమే ప్రేక్షకులు ఆల్కహాల్‌ను తాగేందుకు అవకాశం ఉంది.

పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ఖతర్‌లో ఎక్కడపడితే అక్కడ మద్యం తాగడం చట్టరీత్యా నేరం. సాధారణంగా లైసెన్స్ పొందిన హోటల్స్, బార్లలో మాత్రమే మద్యం దొరుకుతుంది.

Story first published: Monday, November 21, 2022, 20:08 [IST]
Other articles published on Nov 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+