Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: చివరి టోర్నీలోనైనా క్రిస్టియానో రొనాల్డో కల తీరేనా?

FIFA World Cup 2022: Cristiano Ronaldo preparing for final shot at glory

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ సాకర్‌ సమరానికి సమయం అసన్నమైంది. ఖాతార్‌ వేదికగా ఆదివారం (నవంబర్‌ 20) ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఖతార్‌, ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లోనైనా ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కల నేరవేరుతుందా? అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2003 నుంచి పోర్చుగల్‌ జాతీయ సీనియర్‌ జట్టుకు ఆడుతున్న రొనాల్డో తన కెరీర్‌లో ప్రొఫెషనల్‌ లీగ్స్‌లో (ప్రీమియర్‌ లీగ్, లా లిగా, చాంపియన్స్‌ లీగ్, సెరియా లీగ్‌) అందుబాటులో ఉన్న అన్ని గొప్ప టైటిల్స్‌ సాధించాడు. కానీ ప్రపంచకప్‌ ఒక్కటే అతడిని అందని ద్రాక్షగా ఊరిస్తోంది.

వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న రొనాల్డో ఆఖరి ప్రయత్నంగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన నాయకత్వంలో పోర్చుగల్‌ను 2016లో యూరో చాంపియన్‌గా నిలబెట్టిన రొనాల్డో 2019లో నేషన్స్‌ లీగ్‌ టైటిల్‌ కూడా అందించాడు. ఈసారి పోర్చుగల్‌ విశ్వవిజేతగా నిలిస్తే క్రిస్టియానో రొనాల్డో దిగ్గజాల సరసన చేరడంతోపాటు తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంటాడు.

ఫిఫా 9వ ర్యాంక్ కలిగిన పోర్చుగల్ ఈ మెగాటోర్నీ హాట్‌ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్‌ యువ, సీనియర్‌ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. రికార్డుస్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో జట్టుకు వెన్నెముకలాంటి వాడు. పోర్చుగల్‌ తరఫున ఇప్పటి వరకు 191 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 117 గోల్స్‌ సాధించి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. రొనాల్డోతోపాటు రాఫెల్‌ లియావో, బెర్నార్డో సిల్వా, రూబెన్‌ డయాస్‌ కీలక ఆటగాళ్లు. 1966 ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలవడం పోర్చుగల్ అత్యుత్తమ ప్రదర్శన. యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ ప్లే ఆఫ్‌ విజేతగా నిలిచి ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

Story first published: Saturday, November 19, 2022, 20:24 [IST]
Other articles published on Nov 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+