Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: ఓరయ్యో.. ఓరయ్యా.. రొనాల్డో కలచెదిరేరా!

ronaldo cries

దోహా: సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో కల చెదిరింది. కెరీర్ చివరి ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ పోర్చుగల్ స్టార్‌కు నిరాశే ఎదురైంది. అనామక జట్టు మొరాకో.. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్‌కు షాకచ్చింది. దాంతో పుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 1-0తో బలమైన పోర్చుగల్‌కు చెక్ పెట్టి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మెగా టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి ఆఫ్రికన్ టీమ్‌గా రికార్డులకెక్కింది.

స్టార్ ప్లేయర్ యూసెఫ్ ఎస్ నెస్రీ 42వ నిమిషంలో హెడర్‌తో అద్భుత గోల్ చేసి మొరాకోకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. గ్రూప్ స్టేజ్‌లో బెల్జియం, ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్‌కు చెక్ పెట్టిన ఆఫ్రికన్ టీమ్.. ఇప్పుడు పోర్చుగల్‌ను చిత్తు చేసింది. దీంతో 1966, 2006 తర్వాత సెమీస్ చేరాలని ఆశించిన పోర్చుగల్‌కు నిరాశే ఎదురైంది.

కెరీర్‌లో వెలితిగా ఉన్న కప్పు అందుకోవాలని ఆశించిన రొనాల్డో కల నెరవేరలేదు. ప్రిక్వార్టర్స్‌లో రొనాల్డోను చాలా సేపు బెంచ్‌పై ఉంచి రమోస్‌ను ఆడించి హిట్ కొట్టిన పోర్చుగల్ ఈసారి 50 నిమిషాల దాకా రొనాల్డోను బెంచ్‌పై కూర్చోబెట్టి మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు.

FIFA World Cup 2022: Cristiano Ronaldo Cries After Morocco Beat Portugal To Reach Semis

మొరాకో కీపర్‌ యాసిన్‌ బోనో గోల్‌కు అడ్డుగోడలా నిలిచాడు. పోర్చుగల్‌.. ఎక్కువ శాతం బంతిని తమ నియంత్రణలో ఉంచుకొన్నా.. ఫినిషింగ్‌ లోపంతో బోర్లాపడింది. గత మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచిన రమోస్‌.. మొరాకో డిఫెన్స్‌ను ఛేదించలేక పోయాడు. దీంతో ఫస్టాఫ్‌లో బెంచ్‌కే పరిమితమైన రొనాల్డోను సెకండాఫ్‌లో బరిలోకి దించినా.. గోల్‌ నమోదు కాలేదు. పోర్చుగల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. మొరాకో మాత్రం పోరాడితే పోయేదేం లేదన్నట్టుగా ఆడింది.

అంతర్గత పాస్‌లతో పోర్చుగల్‌ బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకొన్నా.. మొరాకో గోల్‌పోస్టుపై కచ్చితమైన దాడులు చేయలేక పోయింది. రమోస్‌ కొన్ని ప్రయత్నాలు చేసినా.. తగిన సహకారం కొరవడడంతో నిరాశగా వెనుదిరిగాడు. 90వ నిమిషంలో రొనాల్డో కిక్‌ను కూడా బోనో ఆపడంతో పోర్చుగల్‌ మరింత డీలా పడింది. ఈ ఓటమితో వరల్డ్‌కప్‌ ముద్దాడకుండానే రొనాల్డో కెరీర్‌ ముగిసిపోనుంది.

Story first published: Sunday, December 11, 2022, 8:02 [IST]
Other articles published on Dec 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+