Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: సెర్బియాకు చుక్కలు చూపించిన కామెరూన్!

FIFA World Cup 2022: Cameroon, Serbia Share The Spoils In Thrilling 3-3 Draw

దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022లో సెర్బియా విజయాన్ని కామెరూన్ అడ్డుకుంది. అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి గట్టెక్కింది. గ్రూప్‌ జిలో భాగంగా కామెరూన్, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌ 3-3తో ఫలితం తేలకుండా ముగిసింది. దాంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్‌ వచ్చి చేరింది.

మ్యాచ్‌ 29వ నిమిషంలోనే చార్లెస్ కాస్టెల్లెట్‌ కామెరూన్‌కు తొలి గోల్‌ను అందించాడు. ఇక ఖతా తెరిచేందుకు సెర్బియా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పదే పదే కామెరూన్ గోల్ పోస్ట్‌‌లోకి దూసుకెళ్లినా
ఆ జట్టు డిఫెన్స్‌ సమర్థవంతంగా అందుకుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో మ్యాచ్‌ రిఫరీ 6 నిమిషాల అదనపు సమయం కేటాయించాడు. ఈ సమయంలో సెర్బియా ఆనూహ్యంగా పుంజుకుంది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండు గోల్స్‌ను సాధించి 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.

(45+1వ నిమిషంలో) పావ్లోవిచ్ సెర్బీయా తరపున తొలి గోల్‌ సాధించగా.. మిలిన్కోవిచ్ (45+3వ నిమిషంలో) మరో గోల్‌ను సాధించాడు. దాంతో మ్యాచ్‌ ఫస్టాఫ్ ముగిసే సరికి సెర్బియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెకండాఫ్‌లోనూ సెర్బియా తన జోరును కోనసాగించింది. 53వ నిమిషంలో మిత్రోవిచ్ సెర్బియాకు మరో గోల్‌ను అందించి ఆధిక్యాన్ని మూడింతలు చేశాడు. దాంతో సెర్బియా విజయం ఖాయమని అంతా అనుకున్నారు. బంతిపై కూడా ఆ జట్టు ఆధిపత్యం చెలాయించడంతో తిరుగులేదనుకున్నారు.

కానీ కామెరూన్ అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. వరుసగా రెండు గోల్స్‌ను సాధించి సెర్బియాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. కాగా సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన విన్సెంట్ అబుబకర్ (63 నిమిషంలో), చౌపో మోటింగ్ (66వ నిమిషంలో) గోల్స్‌ సాధించి కామెరూన్ ఓటమిని తప్పించారు. ఆ తర్వాత ఇరు జట్లు హోరా హోరీగా తలపడటంతో ఫలితం తేలలేదు.

ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంతో ఇరు జట్లకు టోర్నీలో ముందడుగు వేసే అవకాశాలు సన్నగిల్లాయి. గ్రూప్ జీలో నాలుగు, ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. బ్రెజిల్, స్విట్జర్లాండ్ టాప్-2లో కొనసాగుతున్నాయి.

Story first published: Monday, November 28, 2022, 21:44 [IST]
Other articles published on Nov 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+