FIFA WC 2022: ఖతర్ కథ వేరు.. అందాల విందు.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే!

హైదరాబాద్: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాకర్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో (నవంబర్ 20) ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022కు తెరలేవనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ బిగ్ టోర్నీకి ఈసారి అరబ్ దేశాల్లో ఒకటైన ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. యావత్ ప్రపంచం మెచ్చిన ఈ ఆటను చూసేందుకు అభిమానులు ఖతర్ వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. పుట్‌బాల్ ప్రభావం ఉన్న అమెరికా, యూకే లాంటి దేశాల నుంచి చాలా మంది అభిమానులు ఖతార్‌కు బయల్దేరారు. దాదాపు నెలరోజులపాటు జరగనున్న ఈ సాకర్ సమరం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ జరిగిన ప్రతీసారి మహిళలు, యువతులు తమ అందచందాలతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటారు.
గత టోర్నీలు యూరప్‌లో జరిగాయి. అక్కడ విచ్చలవిడిగా పార్టీలు, డ్రగ్స్ వినియోగం, సెక్స్ వంటివి సర్వ సాధారణం. ఈసారి ప్రపంచకప్ జరిగేది సంప్రదాయక ముస్లిం దేశం అయిన ఖతర్. ఇక్కడ కథ వేరే ఉంటది. ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముస్లిం చట్టం షరియా ప్రకారం శిక్షలు విధిస్తారు. కాబట్టి ఫిఫా ప్రపంచకప్ కోసం వచ్చే అభిమానులు ఓ నాలుగు విషయాల్లో ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే.

1. ఆల్కహాల్..
పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ఖతర్‌లో ఎక్కడపడితే అక్కడ మద్యం తాగడం చట్టరీత్యా నేరం. సాధారణంగా లైసెన్స్ పొందిన హోటల్స్, బార్లలో మాత్రమే మద్యం దొరుకుతుంది. ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో ఖతర్ ప్రభుత్వం కాస్త సడలింపులు ఇచ్చింది. మ్యాచ్‌లు జరిగే ప్రదేశాల్లో మద్యం తీసుకున్నా చూసి చూడనట్లు వ్యవహరించాలని అక్కడి పోలీసులను ఆదేశించింది. అలా అని తాగి రోడ్లమీదకు వచ్చి రచ్చ చేస్తానంటే జైలులో ఊసలు లెక్కించాల్సిందే.

2. సెక్స్..
వివాహం కాని పురుషుడు, స్త్రీ సెక్స్ చేసుకోవడం ఖతర్ చట్టాల ప్రకారం నేరం. ముస్లిం దేశాల్లో ఈ నేరానికి శిక్షలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. యూరోపియన్ దేశాల మాదిరిగా రోడ్లమీదే ముద్దులు, బహిరంగంగా సెక్స్ చేసుకోవడం ఖతర్‌లో కుదురదు. అక్కడ పెళ్లికాని అమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగినా నేరమే. కానీ ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో కొన్ని సడలింపులు ఇచ్చారు. పెళ్లి కాని యువతీ యువకులు కలిసి తిరిగినా.. హోటల్స్‌లో ఉన్నా పట్టించుకోరు. కానీ బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు, టచింగ్స్ వంటి లైంగికపరమైన చర్యలకు పాల్పడితే తాట తీస్తారు.

3. డ్రగ్స్..
ఖతర్‌లో డ్రగ్స్ నిషేధం. డ్రగ్స్ వ్యవహారంలో ఖతర్ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడికి డ్రగ్స్ తీసుకెళ్లినా నేరమే. ఖతర్ విమానాశ్రయంలో దిగినప్పట్నుంచే డ్రగ్స్ మీద అవగాహన ఏర్పరిచే బోర్డులు, హోర్డింగులు, అడ్వర్టైజ్మెంట్‌లను విరివిగా ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్‌తో పట్టుబడితే జీవితాంతం ఖతర్ జైల్లో ఊసలు లెక్కించాల్సిందే.

4. డ్రెస్ కోడ్ ..
సంప్రదాయ ముస్లిం దేశమైన ఖతర్.. ఫిఫా చూడటానికి వచ్చే పర్యాటకులు ఇక్కడి సంస్కృతిని గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నది. జబ్బలు, తొడలు కనిపించేలా డ్రెస్సులు వేసుకోకూడదని.. స్థానిక సంప్రదాయాలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తోంది. మసీదులు, ప్రార్థనా స్థలాలకు వెళ్లే వాళ్లు మాత్రం తప్పనిసరిగా అక్కడి డ్రెస్ కోడ్ ను పాటించాలని కోరుతుంది. ఖతర్‌లో ఇతరులకు మిడిల్ ఫింగర్ చూపించడం, అనుమతి లేకుండా అపోజిట్ సెక్స్(స్ట్రీ, పురుషుల)వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం,ఫొటోలు తీయడం నేరం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications