For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1970 తర్వాత తొలి విజయం: 'ఫుట్‌బాల్ చరిత్రలో ఓ రికార్డు బ్రేక్ చేశాం'

By Nageshwara Rao
FIFA World Cup 2018: Uruguay Coach Refuses to Point Finger at Wasteful Suarez

హైదరాబాద్: ఫుట్‌బాల్ చరిత్రలో ఉరుగ్వే ఆటగాళ్లు ఓ రికార్డుని బ్రేక్ చేశారని ఆ జట్టు కోచ్ ఆస్కార్ తబరెజ్ వెల్లడించాడు. శుక్రవారం సాయంత్రం ఎకతెరీన్‌బెర్గ్‌ ఎరీనాలో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై ఉరుగ్వే 1-0తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా జోస్ గిమెనెజ్ హెడర్‌తో గోల్ చేయడంతో గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఉరుగ్వే 1-0తో ఈజిప్ట్‌పై గెలిచి శుభారంభం చేసింది. 89వ నిమిషంలో డిఫెండర్‌ గెమినెజ్‌ గోల్‌ కొట్టి ఉరుగ్వేకు విజ‌యాన్నందించాడు.

దీంతో ఉరుగ్వే శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. 1970 తరువాత ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఉరుగ్వే విజయం సాధించడం ఇదే తొలిసారి. 48ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో గెలుపొందడంపై ఆ జట్టు కోచ్ ఆస్కార్ తబరెజ్ సంతోషం వ్యక్తం చేశారు.

టోర్నీలో జరగబోయే మిగతా మ్యాచ్‌ల్లో జట్టులోని ఆటగాళ్లు ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరాడు. పుట్‌బాల్ చరిత్రలో తమ జట్టు ఓ రికార్డును బ్రేక్ చేసిందని చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా జరిగే తదుపరి మ్యాచ్‌ల్లో గెలుపు కోసం చావనైనా చస్తాం.. లేదా చంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ వరల్డ్ కప్‌లో తమ జట్టులోని ఆటగాళ్లు తమలోని పురోగతిని కొనసాగించాలని సూచించాడు. కాగా, ఈజిప్ట్‌తో జరిగిన పోరుపై తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. "కొన్నిసార్లు బంతి నెట్ వెనక్కి వెళ్లింది. కొన్నిసార్లు అటువైపే వెళ్లనేలేదు. మ్యాచ్ మొత్తంలో మా జట్టు ప్రదర్శన, ఆటతీరు చూసి చాలా గర్వపడుతున్నా" అని చెప్పాడు.

Story first published: Saturday, June 16, 2018, 16:19 [IST]
Other articles published on Jun 16, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+