For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్: టోర్నీలో పాల్గొనే 32 దేశాల బీర్లు ఒకేచోట!

By Nageshwara Rao
FIFA World Cup 2018: UK man celebrates FIFA fever by collecting 32 beers from all participating nations

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌కు క్రేజ్ అమాంతం పెరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్, డెనిస్ సెరిషేవ్ గోల్, అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఐస్‌ల్యాండ్ అద్భుత ప్రదర్శన అభిమానులను కనువిందు చేసింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

రష్యా వరల్డ్ కప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలా చక్కగా ఆదరిస్తున్నారు. అభిమానులు సైతం ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రదర్శిస్తున్నారు. వరల్డ్‌ కప్‌ అంటే ఆ అభిమానం మరింత రెట్టింపు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

తాజాగా యూకేలోని చెల్టెన్‌హామ్‌కు చెందిన గస్‌ హల్లీ ఫుట్‌బాల్‌పట్ల తన మక్కువను వెరైటీగా చాటాడు. బీర్లుతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. వరల్డ్‌కప్‌లో తలపడుతున్న 32 దేశాల బీర్లను సేకరించి వరల్డ్ కప్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఇందుకు గాను అతడు రూ.45 వేలు ఖర్చు పెట్టాడు.

గస్‌ హల్లీ సేకరించిన వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన కార్ల్స్‌బర్గ్(డెన్మార్క్), హెగార్డెన్(బెల్జియం) బీర్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. సెనెగల్, ఉరుగ్వేకు చెందిన బీర్లను సేకరించడంలో తాను కాస్త ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. ఇక, పనామాకు చెందిన బీర్‌ను మాత్రం తన స్నేహితుడు ఇచ్చినట్లు తెలిపాడు.

ఇక, సౌదీ అరేబియా(హిల్స్ బర్గ్), ఇరాన్(డెల్‌స్టర్)లకు చెందిన బీర్లను మాత్రం లిబియా నుంచి సేకరించినట్లు తెలిపాడు. టోర్నీ నుంచి ఒక్కో జట్టు తప్పుకున్న సమయంలో ఈ బీర్లను తాను ఓపెన్ చేయనున్నట్లు తెలిపాడు. చివరకు ఏ బీర్ తన వద్ద మిగిలుతుందో తెలుసుకునేందుకు చాలా ఆతృతగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

Story first published: Monday, June 18, 2018, 12:40 [IST]
Other articles published on Jun 18, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+