For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌదీ జట్టుకు తప్పిన పెను ప్రమాదం: విమాన ఇంజిన్‌లో మంటలు (వీడియో)

By Nageshwara Rao
 FIFA World Cup 2018: Saudi Arabia football teams plane engine catches fire; video

హైదరాబాద్: రష్యా వేదికగా ఫిఫా వరల్డ్ కప్‌లో సౌదీ అరేబియా వరల్డ్ కప్ జట్టు పెను ప్రమాదం నుంచి బయటపడింది. టోర్నీలో భాగంగా సౌదీ అరేబియా జట్టు తమ తదుపరి మ్యాచ్ కోసం రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌‌కు ప్రయాణిస్తోన్న సమయంలో విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

అయితే, పైలెట్ అప్రమత్తతో విమానంలో ప్రయాణిస్తోన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సౌదీ పుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. సౌదీ పుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ హర్బీ సౌదీ స్పోర్ట్స్ టీవీ ఛానల్ కెఎస్ఏతో మాట్లాడుతూ "ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. కుడివైపున ఉన్న ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించినప్పటికీ, విమానం క్షేమంగానే ల్యాండ్ అయింది" అని అన్నాడు.

సౌదీ అరేబియా పుట్‌బాలర్లు సైతం విమాన ఫైలట్ పనితనంపై ప్రసంశల వర్షం కురిపించారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన వీడియోని సౌదీ అటగాడు హతన్ బాహ్బిర్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా "సేఫ్‌గా చేరుకున్నాం. అందరం క్షేమంగానే ఉన్నాం" అని కామెంట్ పెట్టాడు.

విమాన ఇంజిన్‌‌లో మంటలు వ్యాపించిన సమయంలో భయపడ్డారా? అని కొందరు ఆటగాళ్లను విలేకరులు ఈ వీడియోలో అడగడం మనం గమనించొచ్చు. అయితే, అందుకు వారు "అలాంటిది ఏమీ లేదు. అయితే, కాస్త భయపడ్డాం. దేవుడి థ్యాంక్స్ చెప్పాలి" అని అన్నారు.

సౌదీ అరేబియా పుట్‌బాల్ ఫెడరేషన్‌కు చెందిన అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. సౌదీ జట్టు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి రొస్తోవ్ ఆన్ డాన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రష్యన్ ఎయిర్ బస్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో రొస్తోవ్ ఆన్ డాన్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

టోర్నీలో భాగంగా సౌదీ అరేబియా జట్టు బుధవారం ఉరుగ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌‌ నగరంలోని రొస్తోవ్‌ ఎరీనాలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకే సౌదీ అరేబియా జట్టు రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌‌కు సౌదీ అరేబియా జట్టు బయల్దేరగా ఈ ప్రమాదం సంభవించింది.

టోర్నీలో భాగంగా రష్యాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా 5-0తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, June 19, 2018, 17:16 [IST]
Other articles published on Jun 19, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+