For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కప్‌లో మరో సంచలనం: రష్యా షూటౌట్‌కు స్పెయిన్ ఇంటికి

By Nageshwara Rao
FIFA World Cup 2018: Russia eliminate Spain from World Cup in last-16 penalty shootout
FIFA World Cup 2018: Russia 1 Spain 1 (4-3 on penalties): Akinfeev the shootout hero in huge shock

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగిన స్పెయిన్ పేలవ ఆటతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 78 వేల మంది ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో సొంతగడ్డపై రష్యా అద్భుత ప్రదర్శన చేసింది. ఎలాంటి అంచనాలు లేని నేపథ్యంలో బరిలోకి దిగి ఏకంగా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆదివారం లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రష్యా 4-3 స్కోరు (పెనాల్టీ షూటౌట్‌)తో స్పెయిన్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్‌ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది.

1
958072

రష్యా ఆటగాడు ఇగ్నషెవిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేయడంతో 12వ నిమిషంలో స్పెయిన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. 41వ నిమిషంలో జుబా పెనాల్టీని గోల్‌గా మలచడంతో రష్యా 1-1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ నమోదు కాకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది.

షూటౌట్లో ఒత్తిడికి గురైన స్పెయిన్

షూటౌట్లో స్పెయిన్‌ ఒత్తిడికి గురైంది. ఆ జట్టు ఆటగాళ్లు కొకె, అస్పాస్‌ కిక్‌లను విజయవంతంగా అడ్డుకున్న గోల్‌కీపర్‌ అకిన్‌ఫీవ్‌ రష్యాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతేకాదు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా అవార్డు కూడా లభించింది. వరుసగా ఐదో వరల్డ్‌ కప్‌లో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే నెగ్గడం విశేషం. ఈ టోర్నీలో తొలిసారి ఫలితం షూటౌట్‌ ద్వారా తేలగా, రష్యా 48 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌ చేరింది. మ్యాచ్‌లో స్పెయిన్‌ బంతిని 79 శాతం తన నియంత్రణలో ఉంచుకున్నా, ఒత్తిడితో సరిగ్గా ఆడలేకపోయింది. ఈ మ్యాచ్‌లో రష్యా ఢిఫెన్స్ అద్భుతంగా ఉంది. ప్రత్యర్ధి జట్టు గోల్‌ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది.

191 పాస్‌లు పూర్తి చేసి విజేతగా రష్యా

191 పాస్‌లు పూర్తి చేసి విజేతగా రష్యా

మ్యాచ్‌లో స్పెయిన్‌ 1006 పాస్‌లు ఆడింది. కానీ రష్యా కేవలం 191 పాస్‌లు పూర్తి చేసి మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. స్టార్లతో నిండిన స్పెయిన్‌కు రష్యా నుంచి పెద్దగా పోటీ ఎదురుకాకపోవచ్చన్నది మ్యాచ్‌ ముందు అంచనా. అయితే ఆరంభంలో 38 ఏళ్ల సీనియర్‌ ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్‌ చేసిన తప్పుతో తొలి గోల్‌ స్పెయిన్‌ ఖాతాలో పడింది. రష్యా గోల్‌ పోస్ట్‌ ఎడమ వైపు నాచోను జిర్కోవ్‌ అడ్డుకోవడంతో స్పెయిన్‌కు ఫ్రీ కిక్‌ లభించింది. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఇగ్నాషెవిచ్‌ తన వైపు దూసుకొస్తున్న బంతిపై దృష్టి పెట్టకుండా స్పెయిన్‌ స్టార్‌ సెర్గియో రామోస్‌ను మార్కింగ్‌ చేసే ప్రయత్నం చేస్తూ అతడిని పడేశాడు.

ఈ టోర్నీలో రష్యాకు ఇది రెండో సెల్ఫ్‌ గోల్‌

ఈ టోర్నీలో రష్యాకు ఇది రెండో సెల్ఫ్‌ గోల్‌

ఈ క్రమంలో ఇగ్నాషెవిచ్‌ మడమకు తగిలి బంతి నెట్లోకి వెళ్లింది. ఈ టోర్నీలో రష్యాకు ఇది రెండో సెల్ఫ్‌ గోల్‌. 1966లో బల్గేరియా తర్వాత ఒకే జట్టు రెండు సెల్ఫ్‌ గోల్స్‌ ఇవ్వడం ఇదే మొదటి సారి. ఆ తర్వాత స్పెయిన్‌ నెమ్మదించింది. అనేక పాసులతో బంతిని ఎక్కువగా నియంత్రణలోనే ఉంచుకున్నా ప్రత్యర్థి బాక్స్‌లోకి చొచ్చుకెళ్లింది చాలా తక్కువ. రష్యా మాత్రం ఆ తర్వాత ధాటిని పెంచింది. 42వ నిమిషంలో స్కోరు సమం చేసింది. జుబా హెడర్‌ పిక్‌ చేతికి తగలడంతో రష్యాకు పెనాల్టీ లభించింది. జుబా అలవోకగా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించాడు.

1986 తర్వాత నాకౌట్‌ దశలో రష్యా చేసిన తొలి గోల్‌

దీంతో స్టేడియంలో ఉన్న రష్యా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 1986 తర్వాత నాకౌట్‌ దశలో రష్యా చేసిన తొలి గోల్‌ ఇదే కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో రష్యాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చినా, అది చేజార్చుకుంది. రష్యా డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచింది. 67వ నిమిషంలో ఇనియెస్టా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. బంతి ఎక్కువగా రష్యా అర్ధభాగంలోనే ఉంది. కొద్దిసేపు గడిచే సరికి ఇరు జట్లు బాగా అలసిపోయినట్లు కనిపించాయి. దాంతో అంతా డిఫెన్స్‌ తరహా ఆటను ప్రదర్శించారు. 83 నిమిషంలో ఇనియెస్టా షాట్‌ను అకిన్‌కీఫ్‌ అడ్డుకున్నాడు. ఇంజురీ సమయంలోనూ గోల్‌ నమోదు కాకపోవడంతో ఆట అదనపు సమయానికి దారి తీసింది.

వరుస దాడులతో రష్యా డిఫెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి

అదనపు సమయంలో స్పెయిన్‌ మరింత వేగం పెంచింది. వరుస దాడులతో రష్యా డిఫెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ గోల్‌ మాత్రం కొట్టలేకపోయింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌ తప్పలేదు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తర్వాత రష్యా ఫిఫా వరల్డ్ కప్‌లో క్వార్టర్స్‌ చేరడం ఇదే తొలిసారి. విచ్ఛిన్నానికి ముందు 1970లో ఆ దేశం క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఇక, ప్రపంచకప్‌లో నాలుగుసార్లు షూటౌట్లు ఆడిన స్పెయిన్‌ మూడుసార్లు ఓటమిపాలైంది. 1986లో బెల్జియం, 2002లో దక్షిణ కొరియా ఆ జట్టును ఓడించడం విశేషం.

Story first published: Monday, July 2, 2018, 10:32 [IST]
Other articles published on Jul 2, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+