న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: లైవ్‌లో ఫీమేల్ రిపోర్టర్‌ని ముద్దాడిన అభిమాని (వీడియో)

By Nageshwara Rao
FIFA World Cup 2018: Reporter kissed and groped on breast by fan on live TV

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను కవర్ చేస్తున్న ఓ టీవీ రిపోర్టర్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. కొలంబియా జర్నలిస్ట్ జూలియెత్ గొంజాలెజ్ ఓ జర్మన్ ఛానెల్‌కు లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

జూలియెత్ గొంజాలెజ్ ఫిఫా వరల్డ్ కప్‌ కవరేజిలో భాగంగా జర్మన్ చానెల్ డష్ వెలెకు ఆమె పని చేస్తోంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన వీక్షకులను ఓ వీధిలో నిలబడి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఆమె చెంపపై ముద్దు పెట్టి వెళ్లిపోయాడు.

ఈ వీడియోని జూలియెత్ గొంజాలెజ్ స్వయంగా ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. "తాను ఆ స్పాట్‌లో రెండు గంటలుగా ఉన్నానని, అయితే లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టే వరకు ఆ వ్యక్తి వేచి చూశాడని" ఆమె చెప్పింది. లైవ్‌లో ఇలా చేస్తే తాను వెంటనే రియాక్టయ్యే అవకాశం ఉండదని భావించి అతనిలా చేసినట్లు జూలియెత్ వెల్లడించింది.

మరోవైపు అతను ముద్దు పెట్టి వెళ్లినప్పటికీ, జూలియెత్ గొంజాలెజ్ మాత్రం అలాగే లైవ్ కొనసాగించింది. ఆ తర్వాత అతని కోసం వెతికినా కనిపించలేదని జూలియెత్ చెప్పింది. ఆమెకు ముద్దు పెట్టిన వ్యక్తి రష్యాకు చెందిన వ్యక్తా లేక రష్యాకు వరల్డ్‌కప్ చూసేందుకు వచ్చిన వ్యక్తా అన్నది స్పష్టంగా తెలియరాలేదు.

Story first published: Wednesday, June 20, 2018, 13:59 [IST]
Other articles published on Jun 20, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X