ఉత్కంఠ పోరు..: నాకౌట్‌కు పోర్చుగల్, టోర్నీ నుంచి ఇరాన్ నిష్క్రమణ

హైదరాబాద్: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ నాకౌట్‌కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి ఇరాన్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఐదు పాయింట్లతో పోర్చుగల్ నాకౌట్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇరాన్ ఆఖర్లో అద్భుత ప్రదర్శన చేసింది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా... ఇరాన్ జట్టు మాయ చేసింది. పెనాల్డీ రూపంలో వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకుంది. ఇరాన్ ఆటగాడు కరీమ్ (90+3 నిమిషంలో)గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించాడు. తొలి అర్ధ భాగంలోనే పోర్చుగల్ స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా తొలి గోల్(44వ నిమిషంలో) నమోదు చేశాడు.
సమర్ధవంతంగా అడ్డుకున్న ఇరాన్ డిఫెండర్లు
ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ అటాకింగ్ గేమ్ ఆడుతూ పలుమార్లు ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్ట్‌పై దాడులు చేయగా ఇరాన్ డిఫెండర్లు వాటిని సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఆటలో భాగంగా ఇరు జట్లు వీఏఆర్‌ను వాడుకున్నాయి. క్రిస్టియానో రోనాల్డో ఓ దశలో పెనాల్టీ మిస్ చేశాడు. అంతేకాదు ఒకానొక సమయంలో రొనాల్డో దూకుడుగా ఆడటంతో రెఫరి ఎల్లో కార్డుచూపించాడు.
14సార్లు గోల్ కోసం ప్రయత్నించిన పోర్చుగల్
మ్యాచ్‌లో పోర్చుగల్ 14సార్లు గోల్ కోసం ప్రయత్నించగా, ఇరాన్ ఎనిమిది సార్లు ప్రయత్నించింది. పోర్చుగల్-ఇరాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో గ్రూప్ బిలో అయిదు పాయింట్లతో స్పెయిన్, పోర్చుగల్ టాప్‌లో ఉన్నాయి. దీంతో ఆ రెండు జట్లు ఆ గ్రూప్ నుంచి నాకౌట్ దశకు చేరుకున్నాయి.
మొరాకాతో జరిగిన మ్యాచ్‌ను స్పెయిన్ 2-2తో డ్రా
గ్రూప్ బిలో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో మొరాకాతో జరిగిన మ్యాచ్‌ను స్పెయిన్ 2-2తో డ్రాగా ముగించింది. దీంతో గ్రూప్ దశలో ఒక్క విజయం సాధించని మొరాకోతో పాటు పోర్చుగల్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఇరాన్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఉరుగ్వేతో తలపడనున్న పోర్చుగల్
టోర్నీలో భాగంగా గ్రూప్ బిలో రన్నరప్‌గా ఉన్న పోర్చుగల్ నాకౌట్ పోరులో బలమైన ఉరుగ్వేతో తలపడనుంది. శనివారం ఈ మ్యాచ్ సోచిలో జరుగుతుంది. ఇక, గ్రూప్ ఏ నుంచి సౌదీ ఆరేబియా, ఈజిప్ట్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications