Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: కొలంబియా చేతిలో పోలెండ్ ఓటమి, టోర్నీ నుంచి నిష్క్రమణ

FIFA World Cup 2018, Poland 0 Colombia 3: Falcaos maiden World Cup goal revitalises Pekermans side

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో కొలంబియా విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పోలెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో కొలంబియా ఘన విజయం సాధించింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ క్రమంలో ఆట 40వ నిమిషంలో యోర్రి మైనా తొలి గోల్‌ నమోదు చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి కొలంబియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో కొలంబియా ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై పదే పదే దాడులు చేశారు.

ఈ క్రమంలో 70వ నిమిషంలో రాడమెల్‌ ఫాల్కా మరో గోల్‌ చేయడంతో కొలంబియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 75వ నిమిషంలో కుడ్రాడో మరో గోల్‌ చేయడంతో కొలంబియా శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. వరల్డ్ కప్‌లో కుడ్రాడోకి ఇది రెండో గోల్‌ కావడం విశేషం.

2014లో జరిగిన వరల్డ్ కప్‌లో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడ్రాడో తొలి గోల్‌ నమోదు చేశాడు. మ్యాచ్ మొత్తం పోలెండ్ ఆటగాళ్లు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. దీంతో మ్యాచ్‌ ముగిసేలోపు ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయారు. దీంతో కొలంబియా 3-0తో పోలెండ్‌పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో పోలెండ్ జట్టు 15 సార్లు తప్పిదాలు చేయగా, కొలంబియా జట్టు 10 సార్లు తప్పిదాలకు పాల్పడింది. కీలకమైన మ్యాచ్‌లో పోలాండ్ ఓడిపోవడంతో ఆ టీమ్ క్వార్టర్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 3-1 తేడా గోల్స్‌తో విక్టరీ నమోదు చేసింది.

గ్రూప్‌లోని మొదటి మ్యాచ్‌లో జపాన్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న కొలంబియా ఈ మ్యాచ్‌లో సత్తా చాటింది. తాజా ఓటమితో పోలెండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ హెచ్‌లో జపాన్, సెనెగల్ నాలుగేసి పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. కొలంబియాకు మూడు పాయింట్లు ఉన్నాయి.

కొలంబియా తన చివరి మ్యాచ్‌ను సెనెగల్‌తో ఆడుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిస్తే, ఆ జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. రష్యా వేదికగా జరుగుతున్న 21వ వరల్డ్ కప్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి యూరోపియన్‌ జట్టుగా పోలెండ్‌ నిలిచింది.

Story first published: Monday, June 25, 2018, 12:34 [IST]
Other articles published on Jun 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+