Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రాన్స్ విజయాన్ని థాయ్ బాలలకు అంకితమిచ్చిన పాల్‌ పోగ్బా

FIFA World Cup 2018: Pogba dedicates France win to freed Thai players

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విజయాన్ని థాయిలాండ్‌లో గుహలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలలకు అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్‌ ఆటగాడు పాల్‌ పోగ్బా ప్రకటించాడు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌-బెల్జియం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెల్జియంపై 1-0తో ఫ్రాన్స్‌ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండు జట్లు హోరా హోరీగా పోరాడటంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ సైతం నమోదు కాలేదు. ఇరు జట్ల ఆటగాళ్లు చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు.

అయితే, రెండో అర్దభాగంలో 51వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు శామ్యూల్‌ ఉమిటిటి హెడర్‌తో బంతిని గోల్‌సోస్ట్‌లోకి పంపించి ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత బెల్జియం జట్టు గోల్‌ కోసం విపరీతంగా ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు. దీంతో ఫ్రాన్స్‌ విజయం సాధించి ఫైనల్‌కు అర్హతస సాధించింది.

మ్యాచ్ అనంతరం ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా మాట్లాడుతూ "ఈ విజయాన్ని థాయలాండ్‌లో గుహ నిర్బంధంలో చిక్కుకుని సురక్షితంగా బయటికి వచ్చిన బాలల ఫుట్‌బాల్‌ జట్టుకు అంకితమిస్తున్నాం" అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు 12 మంది బాలల ఫొటోలను కూడా ఈ ట్వీట్‌కు జత చేయడం విశేషం.

మరోవైపు గుహలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలలు ఆదివారం (జులై 15న) జరిగే ఫైనల్‌ చూసేందుకు రావాలంటూ ముందుగా ఫిఫా నిర్వాహకులు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. అయితే, బాలల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వైద్యుల సలహా మేరకు వారిని ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రావొద్దని సమాచారం అందించినట్లు ఫిఫా ప్రతినిధి తెలిపారు.

బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌-క్రొయేషియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌తో తలపడనుంది.

Story first published: Wednesday, July 11, 2018, 13:46 [IST]
Other articles published on Jul 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+