Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దొర్లుకుంటూ వరల్డ్‌కప్ ఫైనల్‌కు: నెయ్‌మార్‌పై ట్విట్టర్‌లో జోకులు (వీడియో)

FIFA World Cup 2018: Neymar earns Twitter’s wrath for rolling antics vs Mexico

హైదరాబాద్: ప్రస్తుత పుట్‌బాల్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతోన్న లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోకు చెందిన జట్లు రష్యాలో జరుగుతున్న వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో సాకర్ అభిమానుల కళ్లన్నీ మరో స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌ వైపు మళ్లాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఎందుకంటే టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది. వరల్డ్‌కప్ ప్రారంభమైనప్పటి నుంచి టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలెదుర్కొంటున్న నెయమార్ ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు.

తొలి అర్థబాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇక, రెండో అర్దభాగంలో ఆట మొదలైన కాసేపటికే బ్రెజిల్‌ కళ్లు చెదిరే గోల్‌తో ఖాతా తెరిచింది. విలియన్‌ మెరుపు వేగంతో లెఫ్ట్‌ క్రాస్‌తో బంతిని గోల్‌ పోస్టుకు అత్యంత చేరువగా ఉన్న నెయ్‌మార్‌ వైపు మళ్లించాడు.

1
958075

అంతే వేగంతో బంతిని అందుకున్న నెయ్‌మార్ 51వ నిమిషంలో గోల్‌ సాధించి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం ఇరు జట్లు గోల్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. అదే సమయంలో మెక్సికో ఆటగాళ్లు బంతిని తమ ఆదీనంలో ఉంచుకున్నప్పటికి గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు.

చివర్లో మెక్సికో కొంచెం దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ఇక మరికొద్ది క్షణాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా మిడ్‌ఫీల్డర్‌ కౌటిన్హో స్థానంలో వచ్చిన ఫర్మినో 88వ నిమిషంలో గోల్‌ సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో నెయ్‌మార్ ఆటతీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ప్రత్యర్ధి జట్టుకు చెందిన డిఫెండర్లు నెయ్‌మార్‌ను టచ్ చేయగానే అదే పనిగా మైదానంలో డైవింగ్ చేస్తూ కింద పడిపోతున్నాడు. మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో నెయ్‌మార్ ఇదే విధంగా కింద పడిపోవడాన్ని సాకర్ అభిమానులు సరదా ట్వీట్లతో ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీ ట్వీట్లు మీ కోసం...

రష్యా వరల్డ్ కప్‌లో బ్రెజిల్‌ 2-0తో గెలవడం ఇది మూడోసారి. స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించాక ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంతే తేడాతో ప్రత్యర్థి జట్లను ఓడించింది. అంతేకాదు గత 25 మ్యాచ్‌లుగా బ్రెజిల్ తన ప్రత్యర్థి జట్లకు కేవలం 6 గోల్స్‌ చేసే అవకాశం ఇచ్చింది.

బ్రెజిల్ ఓటమి లేకుండా ముగించిన అంతర్జాతీయ మ్యాచ్‌లు 15. చివరగా రెండేళ్ల కిందట కోపా అమెరికా టోర్నీలో పెరూ చేతిలో ఓడింది. ఇక, మెక్సికోపై చేసిన రెండు గోల్స్‌తో కలిపి బ్రెజిల్‌ మొత్తం ప్రపంచకప్‌ టోర్నీల్లో 228 గోల్స్‌ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు జర్మనీ (226)తో సమానంగా ఉంది.

Story first published: Tuesday, July 3, 2018, 15:58 [IST]
Other articles published on Jul 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+