
హైదరాబాద్: ఫిఫా వరల్డ్‌కప్ నిర్వాహక సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా వేదికగా జరుగుతన్న 21వ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు జరిగిన లీగ్ స్టేజి మ్యాచ్‌లకు గాను టెల్‌స్టార్ 18 బంతిని వినియోగించిన వరల్డ్‌కప్ నిర్వాహక సంఘం నాకౌట్ స్టేజిలో మరో కొత్త బంతితో టోర్నీని నిర్వహించనుంది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు టెల్‌స్టార్ 18 బంతిని రూపొందించిన అడిడాస్ సంస్థే సరికొత్త వెర్షన్ టెల్‌స్టార్ మెచ్టా విడుదల చేసింది. 1970 నుంచి ప్రపంచకప్ కోసం అడిడాస్ సంస్థ బంతులను తయారుచేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ ప్రపంచకప్ కోసం తొలిసారిగా తయారుచేసిన బంతికి 'టెల్‌స్టార్' అని పేరు పెట్టింది.
దాని కొనసాగింపుగా 2018 సంవత్సరాన్ని సూచిస్తూ ప్రస్తుత టోర్నీలో వాడే బంతికి 'టెల్‌స్టార్ 18' అని పేరు పెట్టారు. ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌లో వాడబోయే బంతులను పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో తయారు చేయడం విశేషం. పాత మోడల్ బంతికే కొద్ది మార్పులు చేసి టెల్‌స్టార్ మెచ్టాను రూపొందించింది.
ఇదే బంతితో నాకౌట్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ పోటీలను ఫిఫా నిర్వహించనుంది. టోర్నీలో భాగంగా జరిగిన గ్రూప్ స్టేజి మ్యాచ్‌ల్లో టెల్‌స్టార్ 18 బంతితో గోల్స్ చేసేందుకు అష్టకష్టాలు పడిన ఆటగాళ్లు, టెల్‌స్టార్ మెచ్టా బంతితో ఏ మేరకు రాణిస్తారో తెలియాలంటే నాకౌట్ మ్యాచ్‌ల వరకు ఆగాల్సిందే.