For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫ్యాన్స్‌కు శుభవార్త: ఉరుగ్వేతో మ్యాచ్‌కి ఫిట్‌గా సలాహ్

By Nageshwara Rao
FIFA World Cup 2018: Mohamed Salah almost certain to play against Uruguay

హైదరాబాద్: ఈజిప్ట్ సాకర్ అభిమానులకు శుభవార్త. భుజం గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్ ప్రపంచ కప్‌లో ఆడతాడా అనే సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా, సలాహ్ కొలుకున్నాడని, టోర్నీలో భాగంగా ఉరుగ్వేతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడతాడని ఆ జట్టు ప్రధాన కోచ్ హెక్టర్ కూపర్ గురువారం అధికారిక ప్రకటన చేశాడు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

గత నెల ఛాంపియన్స్‌లీగ్‌ ఫైనల్‌ సందర్భంగా అతని భుజానికి గాయం అవడంతో ప్రపంచకప్‌లో అసలు ఆడతాడో లేదో అనే అనుమానాలు వ్యకమయ్యాయి. అయితే గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న సలాహ్ గ్రూప్ ఏలో ఉరుగ్వేతో జరిగే తొలి మ్యాచ్‌కి బరిలోకి దిగుతాడని ప్రధాన కోచ్ వెల్లడించాడు.

"నేను 100 శాతం హామీ ఇస్తున్నా. అతడు ఉరుగ్వేతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడతాడు. అతణ్ని రోజూ గమనిస్తూనే ఉన్నాం. గతంతో పోలిస్తే అతని చాలా త్వరగా కోలుకుంటున్నాడు" అని ప్రధాన కోచ్ హెక్టర్ కూపర్ అన్నాడు. ఈజిప్టు తన తొలి మ్యాచ్‌లో శుక్రవారం ఉరుగ్వేతో తలపడనుంది.

26 ఏళ్ల సలాహ్ ఛాంపియన్స్ లీగ్‌లో 44 గోల్స్‌తో ఈ సీజన్‌లో లివర్‌పూల్‌ తరపున సలా అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్లో రియల్ మాడ్రిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఈ లీగ్‌లో సలాహ్ భుజం గాయం కారణంగా కన్నీటితో మైదానాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత లివర్‌పూల్‌తో పోరాడిన రియల్ మాడ్రిడ్ ఓటమికి గురైంది.

కాగా, మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆరంభ వేడుకల అనంతరం ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇది 21వ ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం.

ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్‌-ఎలో బరిలో నిలిచింది. వరల్డ్ కప్ కోసం మొత్తం 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు ఉంటాయి.

ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్‌ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది.

Story first published: Thursday, June 14, 2018, 19:57 [IST]
Other articles published on Jun 14, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+