For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెక్సికో గెలుపుతో ప్రియుడి ప్రేమను అంగీకరించిన యువతి (వీడియో)

By Nageshwara Rao
FIFA World Cup 2018: Mexico fan publicly proposes to girlfriend after teams win against Germany, watch video

హైదరాబాద్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌‌గా వరల్డ్ కప్ టోర్నీలోకి అడుగుపెట్టిన జర్మనీకి తొలి మ్యాచ్‌లోనే మెక్సికో షాకిచ్చింది. వరల్డ్ నంబర్‌వన్‌ జర్మనీ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన గ్రూఫ్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో మెక్సికో 1-0తో జర్మనీని మట్టికరిపించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

గత ఏడు వరల్ కప్‌ల్లో జర్మనీ జట్టు ఓటమన్నదే లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. తాజా మ్యాచ్‌లో పరాజయంతో ఈ రికార్డుకు తెరపడింది. మెక్సికో ఫార్వర్డ్ ప్లేయర్ హిర్వింగ్ లొజానో 34వ నిమిషంలో సూపర్‌గోల్‌తో వరల్డ్ కప్ చరిత్రలో జర్మనీపై మెక్సికోకు రెండో విజయాన్నందించాడు.

1982 ప్రపంచకప్‌లో మాత్రమే మెక్సికో జర్మనీని ఓడించగా.. మళ్లీ ఇన్నేళ్లకు జర్మనీపై మెక్సికో ఘన విజయం సాధించింది. మ్యాచ్ 34వ నిమిషంలో జర్మనీ డిఫెండర్లను తప్పిస్తూ హిర్వింగ్ లొజానో కళ్లుచెదిరే గోల్ కొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే బలమైన జర్మనీపై తమ జట్టు అద్భుత విజయం సాధించడంతో మెక్సికన్‌ వాసుల్లో ఆనందానికి అవధుల్లేవు.

ఈ ఆనందంలోనే మ్యాచ్‌కు హాజరైన ఓ మెక్సికన్‌ అభిమాని తన ప్రియురాలికి ప్రేమ విషయాన్ని వెల్లడించాడు. ప్రేమను అంగీకరించాలంటూ అభ్యర్థించాడు. దీంతో ఆ అమ్మాయి కూడా అతడి ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో తమ జట్టు గెలిచినప్పుడు ఆ ఆనందంలో ఆటగాళ్లుగానీ, అభిమానులు గానీ దానికి గుర్తుగా తమ ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాలు ఎన్నో సార్లు క్రికెట్ లో కూడా మనం చూశాం.

Story first published: Wednesday, June 20, 2018, 10:46 [IST]
Other articles published on Jun 20, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+