Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంచనాలతో ఆశ్చర్యం: మొన్న చెవిటి పిల్లి.. నేడు మార్కస్ అనే పంది

 FIFA World Cup 2018: Marcus, the pig, is the latest sensation after Achilles, the cat

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ అంటేనే ఎంతో ప్రత్యేకం. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో జ్యోతిష్యులతో పాటు విశ్లేషకులు సైతం ఫలాన జట్టు గెలుస్తుందని ముందుగానే అంచనా వేస్తుంటారు. ఒక్కసారి ఆ అంచనాలు నిజమవగా.. మరోసారి ఫెయిల్ అవుతుంటాయి. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్న జంతువు చెవిటి పిల్లి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో అచిల్లీస్ అనే చెవిటి పిల్లి ఫలాన జట్టు గెలుస్తుందని మ్యాచ్‌కి ముందుగానే అంచనా వేస్తోన్న సంగతి తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాను రష్యా ఓడిస్తుందన్న అచెల్లె చెప్పిన జోస్యం నిజమైంది. వరల్డ్ కప్ మ్యాచ్‌ ఫలితాలను అంచనా వేసేందుకు దీనికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు.

నిజం అవ్వడం ఇది తొలిసారేం కాదు

నిజం అవ్వడం ఇది తొలిసారేం కాదు

2017 కాన్ఫెడరేషన్స్‌ కప్‌ విజేతను కూడా అచిల్లీస్ ఇది సరిగ్గా ఊహించింది. అయితే ఇలా జంతువులు వేసిన అంచనాలు నిజం అవ్వడం ఇది తొలిసారేం కాదు. గత కొన్నేళ్లుగా ప్రతి ఫిఫా వరల్డ్ కప్‌కు ఏదో ఓ జంతువు అభిమానులకు ఇలా తన అంచనాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. దక్షిణాఫ్రికా వేదికగా 2010లో జరిగిన వరల్డ్ కప్‌లో పాల్ అక్టోపస్ అనే సముద్ర జంతువు తన అంచనాలతో ఫుట్‌బాల్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

గతంలో పాల్ అక్టోపస్ ఇలా

గతంలో పాల్ అక్టోపస్ ఇలా

జర్మనీలోని సీలైఫ్‌ సెంటర్‌ నిర్వాహకులు.. ఆహారంతో పాటు వెలుపలి వైపు రెండు దేశాల జెండాలు ఉన్న పెట్టెలను పాల్‌కు అందుబాటులో ఉంచేవాళ్లు. అది ఏ పెట్టెను పట్టుకుంటే ఆ జట్టు గెలుస్తుందని అర్థమన్నమాట. అలా జర్మనీ ఆడిన ఏడు మ్యాచ్‌ల ఫలితాలను కూడా అది సరిగ్గా ఊహించింది. తాజాగా రష్యా వరల్డ్ కప్ సందర్భంగా జోస్యం చెప్పేందుకు ఓ పంది కూడా ముందుకొచ్చింది. దాని పేరు మార్కస్.

మార్కస్ అనే పందికి స్పెషల్ పవర్స్

మార్కస్ అనే పందికి స్పెషల్ పవర్స్

ఈ పందికి స్పెషల్ పవర్స్ ఉన్నాయని, ఫలితాలు ఊహించడంలో మార్కస్‌ది 100 శాతం రికార్డు అని దాని బ్రిటిష్‌ యజమాని చెబుతున్నాడు. ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్‌కు చెందిన మార్కస్ అనే పంది వరల్డ్ కప్‌లో సెమీ పైనల్‌కు వెళ్లే నాలుగు జట్లను ముందుగానే ఊహించింది. ఆయా దేశాల జెండాలు గుచ్చి ఉన్న యాపిల్‌లను తినడం ద్వారా ఇది ఫలితాలను అంచనా వేస్తుందని యజమాని పేర్కొన్నాడు.

మార్కస్ నాకు ఏడో సంతానం లాంటింది

మార్కస్ నాకు ఏడో సంతానం లాంటింది

"మార్కస్ నాకు ఏడో సంతానం లాంటింది. దానికి స్పెషల్ పవర్స్ ఉన్నాయి. 2014 వరల్డ్ కప్ విజేత ఎవరో సరిగ్గా ఊహించింది. అంతేకాదు బ్రెగ్జిట్ రిఫరెండం, అమెరికా ఎలక్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని ముందే ఊహించింది" అని తెలిపాడు. నైజీరియా, బెల్జియం, ఉరుగ్వే, అర్జెంటీనా సెమీఫైనల్‌ వెళ్తాయని ఇప్పటికే ఈ పంది జోస్యం చెప్పింది. అయితే, మార్కస్ చెప్పిన జోస్యం తప్పైంది. ఎందుకంటే ఇప్పటికే టోర్నీ నుంచి లీగ్ దశలోనే నైజీరియా నిష్క్రమించింది.

అచిల్లీస్‌ చెప్పిన జోస్యం మాత్రం తప్పింది

అచిల్లీస్‌ చెప్పిన జోస్యం మాత్రం తప్పింది

నైజీరియా ఆడిన తన చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో 2-1తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు అర్జెంటీనా-నైజీరియా మ్యాచ్‌ గురించి అచిల్లీస్‌ చెప్పిన జోస్యం మాత్రం తప్పింది. ఈ మ్యాచ్‌లో నైజీరియా గెలిచి నాకౌట్‌కు వెళ్తుందని, అర్జెంటీనా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని అచెల్లీస్ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను సంబంధిత సిబ్బంది సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. కానీ, బుధవారం నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-1తేడాతో విజయం సాధించి నాకౌట్‌కు అర్హత సాధించింది.

Story first published: Thursday, June 28, 2018, 17:52 [IST]
Other articles published on Jun 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+