ఫిఫా వరల్డ్ కప్: తొలి 4 మ్యాచ్‌ల్లోనే రికార్డు బద్దలు కొట్టిన ఇండియా

హైదరాబాద్: రష్యా వేదికగా 21వ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సాకర్ అభిమానులు ఈ వరల్డ్ కప్‌ను తెగ ఆస్వాదిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో రష్యాలోని స్టేడియాలన్నీ మారుమోగిపోతున్నాయి.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ వరల్డ్ కప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను సుమారు 10 లక్షల మంది సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక, అక్కడి దాకా వెళ్లి చూసే అవకాశం లేనివాళ్లు వివిధ మార్గాల్లో మ్యాచ్‌లు చూస్తూ ఆనందిస్తున్నారు.
గత వరల్డ్ కప్‌లతో పోలిస్తే ఈ వరల్డ్ కప్‌కు భారతదేశంలో కూడా భారీగా క్రేజ్ పెరిగింది. టీవీ, ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లు వీక్షించే అభిమానుల సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరిగినట్లు భారత బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తన నివేదికలో పేర్కొంది.

నిమిషానికి 4.7 కోట్ల మంది
దీని ప్రకారం భారత్‌లో కనీసం నిమిషానికి సుమారు 4.7 కోట్ల మంది ఈ వరల్డ్ కప్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లను చూసినట్లు తెలిసింది. ఈ 4.7 కోట్ల మందిలో టీవీల ద్వారా వీక్షించిన అభిమానులు 4.1 కోటి మంది కాగా, ఆన్‌లైన్‌లో 60 లక్షల మంది వీక్షించడం విశేషం.

ఎక్కువ వీక్షకుల సంఖ్య ఈ రాష్ట్రాల నుంచే
భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, మహారాష్ట్రలలో మాత్రమే ఈ వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను సుమారు 2 కోట్ల(1.93కోట్ల) మంది చూసినట్లు తెలిసింది.

45 శాతం మంది మహిళలే
ఇందులో 45 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. ఈ వరల్డ్ కప్‌ను యావరేజిగా భారత్‌లోని సాకర్ అభిమానులు 39 నిమిషాల పాటు వీక్షించనట్లు పేర్కొంది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటివరకూ భారత్‌లో ఏ క్రీడను మహిళలు ఈ స్థాయిలో వీక్షించలేదని తెలుస్తోంది.

సోనీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం
రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు పెద్ద సంఖ్యలో భారత్ నుంచి వీక్షకులు ఉండటం గొప్ప విషయంగా చెబుతున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ గ్రూప్ స్టేజిలో ఉంది. ఇప్పటికే మొరాకో, ఈజిప్ట్, ఆస్ట్రేలియా జట్లు గ్రూప్ స్టేజి నుంచి నిష్క్రమించాయి. ఈ వరల్డ్‌కప్‌ను భారత్‌లో సోనీ టెన్-2, టెన్-3, సోనీ ఈఎస్‌పీఎన్ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications