ఫిఫా: స్వీడన్ చేతిలో ఓడిన మెక్సికోకి జర్మనీ ఓటమి కలిసొచ్చింది


హైదరాబాద్: నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్వీడన్ అద్భుత ప్రదర్శన చేసింది. రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గ్రూప్-ఎఫ్‌లో బుధవారం స్వీడన్-మెక్సికో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్వీడన్ 3-0తో అద్భుత విజయం సాధించింది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
మ్యాచ్ ప్రారంభం నుంచి గోల్ సాధించేందుకు ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. తొలి అర్దభాగంలో ఇరు జట్లు ప్రత్యర్ధి జట్ల గోల్ పోస్టులపై దాడులు చేసినప్పటికీ గోల్ నమోదు కాలేదు. దీంతో రెండో అర్ధభాగంలో స్వీడన్ దూకుడుగా ఆడింది. ఆట 50వ నిమిషంలో స్వీడన్ తరఫున అగస్టిన్సన్ గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు.
62వ నిమిషంలో రెండో గోల్
ఆ తర్వాత స్వీడన్ ఆటగాడు గ్రాన్‌క్విస్ట్ 62వ నిమిషంలో మరో గోల్ చేసి 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఇక, చివర్లో 74వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ అల్వారెజ్ ‘సెల్ఫ్ గోల్'తో స్వీడన్ ఆధిక్యం 3-0కు చేరింది. దీంతో స్వీడన్ చేతిలో మెక్సికో 3-0తేడాతో చిత్తుగా ఓటమిపాలైంది. మరోవైపు దక్షిణ కొరియా చేతిలో జర్మనీ ఓడిపోవడంతో ఈ ఓటమి ప్రభావం మెక్సికోపై పడలేదు.

0-2తో దక్షిణ కొరియా చేతిలో జర్మనీ ఓటమి
మెక్సికో చేతిలో పరాభవంతో టోర్నీని ఆరంభించి స్వీడన్‌పై అతి కష్టం మీద గట్టెక్కిన జర్మనీ.. నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో 0-2తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు పాయింట్లే సాధించిన జర్మనీ అనూహ్య రీతిలో గ్రూప్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

ఆసియా జట్టు చేతిలో జర్మనీ ఓడటం ఇదే తొలిసారి
ప్రపంచకప్‌లో ఒక ఆసియా జట్టు చేతిలో జర్మనీ ఓడటం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా జర్మనీని ప్రపంచకప్‌లో ఓడించడం కూడా ఇదే తొలిసారి. గతంలో ఆ జట్టుతో తలపడ్డ రెండుసార్లూ ఓడింది. కాగా, 1938 తర్వాత జర్మనీ ప్రపంచకప్ గ్రూప్ దశలో నిష్క్రమించడం ఇదే తొలిసారి.

గ్రూప్ దశలోనే నిష్క్రమించడం ఇది నాలుగోసారి
ప్రస్తుత టోర్నీతో కలిపి గత ఐదు ప్రపంచకప్‌ల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం ఇది నాలుగోసారి. 2006 ఛాంపియన్ ఇటలీ 2010లో జరిగిన వరల్డ్ కప్‌లో సరిగ్గా ఇలానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2010 విజేత స్పెయిన్ 2014లో కూడా ఇలానే నిష్క్రమించింది. రెండేసి విజయాలు సాధించిన స్వీడన్, మెక్సికో ఆరు పాయింట్లతో గ్రూప్-ఎఫ్ నుంచి నాకౌట్‌కు అర్హత సాధించాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా స్వీడన్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికోకు రెండో స్థానం దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications