Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

48 ఏళ్లలో తొలిసారి: జపాన్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన బెల్జియం

FIFA World Cup 2018 Highlights: Belgium edge Japan 3-2 in five-goal thriller to set up Brazil clash

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో నాకౌట్ మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. నువ్వానేనా అన్నట్లు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి బెల్జియం-జపాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జపాన్‌పై బెల్జియం 3-2తేడాతో విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయక పోవడం విశేషం. దీంతో రెండో అర్ధభాంగా ఆసక్తిగా మారింది.

రెండో అర్దభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే జపాన్‌ ఆటగాడు జెంకీ హరగూచి గోల్‌ చేసి జట్టుకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 52వ నిమిషంలో టకాషి ఇనూయ్‌ మరో గోల్‌ చేయడంతో జపాన్‌కు 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో జపాన్‌ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

1
958074

ఆ తర్వాత 69వ నిమిషంలో జాన్‌ వెట్రోన్‌గన్‌ గోల్‌ చేసి జపాన్‌ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. దీంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. 74వ నిమిషంలో ఫిల్లైని మరో గోల్‌ చేయడంతో ఇరు జట్ల స్కోరు 2-2తో సమం అయింది. ఇక, ఇంజూరీ సమయంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు దూకుడుని ప్రదర్శించారు.

ఇంజూరీ సమయంలో జపాన్ కంటే బెల్జియం ఆటగాళ్లు ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై దాడులను తీవ్రతరం చేశారు. ఈ సమయంలో 90+4వ నిమిషంలో నసెర్‌ చడ్లి గోల్‌ చేయడంతో బెల్జియం 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో మరో రెండు నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. చివర్లో జపాన్ దూకుడుగా ఆడినప్పటికీ మరో గోల్ చేయలేకపోయింది.

దీంతో జపాన్‌పై 3-2 తేడాతో మ్యాచ్‌ గెలిచిన బెల్జియం క్వార్టర్స్‌ చేరుకుంది. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ చరిత్రలో బెల్జియం క్వార్టర్స్‌కు చేరడం మూడోసారి కాగా, వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ గేమ్‌లో 2-0 వెనుకబడి ఆపై విజయాన్ని అందుకోవడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. క్వార్టర్స్‌లో బెల్జియం జట్టు బ్రెజిల్‌తో తలపడనుంది. శుక్రవారం(జులై 6న) ఈ మ్యాచ్‌ కజన్ స్టేడియంలో జరగనుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. కాగా, రష్యా వరల్డ్ కప్‌లో బెల్జియం ఇప్పటి వరకు 12 గోల్స్‌ చేసింది. ఫిపా ప్రపంచకప్‌లో బెల్జియం జట్టు 16, అంతకంటే ఎక్కువ గోల్స్‌ సాధిస్తే టీవీలు ఉచితంగా అందజేస్తామని క్రెఫెల్‌ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌కు ముందు క్రెఫెల్‌ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో "ఈ మెగా టోర్నీలో బెల్జియం జట్టు ఒకవేళ 16, అంతకంటే ఎక్కువ గోల్స్‌ సాధిస్తే.. మా వద్ద టీవీలు కొనుగోలు చేసిన వారికి తిరిగి వారి డబ్బు వారికి పూర్తిగా ఇచ్చేస్తాం. దీనికి ఉన్న ఒకే ఒక్క నిబంధన ఏంటంటే సంస్ధ నిర్ణయించిన కాల పరిమితిలో టీవీలు కొన్నవారికి ఇది వర్తిస్తుంది" అని పేర్కొంది.

ఈ వరల్డ్ కప్‌లో బెల్జియం జట్టు మరో నాలుగు గోల్స్‌ చేస్తే ఆ దేశ వాసులకు క్రెఫెల్ సంస్థ ఉచితంగా టీవీలు అందించనుంది.

Story first published: Tuesday, July 3, 2018, 11:30 [IST]
Other articles published on Jul 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+