For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్: ఏయే జట్ల మధ్యో చెప్పేసిన డేవిడ్ బెక్‌హామ్

By Nageshwara Rao
FIFA World Cup 2018: Here’s who David Beckham thinks will make it to World Cup finals

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న 21 ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలవాలన్నది సగటు సాకర్ అభిమాని మనసులో కోరిక. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ కూడా చేరాడు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఈ వరల్డ్ కప్ ఫైనల్లోకి చేరుకుంటుందని మాజీ స్టార్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ జోస్యం చెప్పాడు. ఈ సందర్భంగా బెక్‌హామ్ మాట్లాడుతూ "ఫైనల్లో ఇంగ్లాండ్‌తో అర్జెంటీనా జట్టు తలపడుతుంది" అని బెక్‌హామ్ చెప్పాడు.

"వరల్డ్ కప్‌లో నేనెప్పుడు ఇంగ్లాండ్ జట్టే గెలవాలని కోరుకుంటా. నా దేశం పట్ల నాకు మక్కువ ఎక్కువ" అని అన్నాడు. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ట్యునీషియా జట్టుపై 2-1తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ అనంతరం చైనాలో ఓ ఈవెంట్‌కు హాజరైన డేవిడ్ బెక్‌హామ్ ఇంగ్లాండ్ జట్టు నాకౌట్‌కు అర్హత సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ అత్యుత్తమ పుట్ బాల్ ఆటగాళ్లలో డేవిడ్ బెక్‌హామ్ ఒకడు. ఫిఫా వరల్డ్ కప్‌లో బెక్‌హామ్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 2006లో జరిగిన వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌ వరకు వెళ్లింది.

యూరోపియన్ లీగ్‌ల్లో బెక్‌హామ్ మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున మూడు సార్లు వరల్డ్ కప్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఆదివారం (జూన్ 24)న పనామాతో తలపడనుంది.

Story first published: Thursday, June 21, 2018, 12:24 [IST]
Other articles published on Jun 21, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+