Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫాలో సెమీఫైనల్: చరిత్ర సృష్టించేది ఇంగ్లాండా లేక క్రొయేషియానా?

FIFA World Cup 2018: England vs Croatia preview, TV timings, venue & more

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో మరో కీలక సమరానికి వేళైంది. టోర్నీలో భాగంగా బుధవారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌-క్రొయేషియా జట్ల తలపడనున్నాయి. 1990 తర్వాత ఇంగ్లాండ్‌కు ఇదే తొలి సెమీస్‌ కాగా.. క్రొయేషియాకు మొత్తంగా ఇది రెండోది కావడం విశేషం.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

తొలిసారిగా 1966లో చాంపియన్‌ అయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత అత్యుత్తమంగా 1990లో సెమీస్‌కు చేరింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ జట్టు మరోసారి టాప్‌-4లో చోటు దక్కించుకుంది. మరోవైపు అండర్‌డాగ్‌గా టోర్నీలో ప్రవేశించిన క్రొయేషియా 16 ఏళ్లుగా గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు

కానీ, ఈసారి మాత్రం అనూహ్యంగా సెమీస్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుసగా రెండు పెనాల్టీ షూటవుట్లను ఎదుర్కొని నెగ్గిన రెండో జట్టుగా కూడా రికార్డు సాధించింది. ఇంగ్లాండ్‌ కూడా తన పెనాల్టీ షూటౌట్‌ బలహీనతను అధిగమిస్తూ.. ప్రిక్వార్టర్స్‌లో షూటౌట్లో కొలంబియాను ఓడించింది.

1
958083

ప్రపంచకప్‌లో తొలిసారి షూటౌట్లో నెగ్గడం ఇంగ్లాండ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. క్రొయేషియా జట్టులో మోద్రిచ్‌, రకిటిచ్‌ రూపంలో అత్యుత్తమ డిఫెండర్లను కలిగిన క్రొయేషియా రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాలని ఊవిళ్లూరుతోంది.

ముఖాముఖి పోరులో ఇంగ్లాండ్‌దే పైచేయి

ముఖాముఖి పోరులో ఇంగ్లాండ్‌దే పైచేయి

ఫిఫా ర్యాంకింగ్స్‌ పరంగా ఇంగ్లాండ్‌ (12)తో పోలిస్తే క్రొయేషియా (20) ఎనిమిది ర్యాంకులు వెనకబడి ఉంది. ముఖాముఖిలో ఇంగ్లాండ్‌దే పైచేయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో క్రొయేషియాతో ఏడుసార్లు తలపడ్డ ఇంగ్లాండ్‌... నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరిసారి 2009లో ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు ఎదురుపడలేదు.

ఆట పరంగా క్రొయేషియాదే పైచేయి

ఆట పరంగా క్రొయేషియాదే పైచేయి

ఈ వరల్డ్‌కప్‌లో ఆటపరంగా చూస్తే మాత్రం అజేయంగా రాణిస్తున్న క్రొయేషియాదే పైచేయిగా భావించవచ్చు. ఇంగ్లాండ్ జట్టు తమ ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. కానీ, క్రొయేషియా మాత్రం తమ రెండో మ్యాచ్‌లోనే మెస్సీ బృందాన్ని 3-0తో చిత్తుగా ఓడించింది. అలాగే నాకౌట్‌ దశలో బెల్జియం ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లో అద్భుత ప్రదర్శన చేసింది. డెన్మార్క్‌, రష్యాపై స్కోర్లు సమమైన స్థితిలో రెండుసార్లూ పెనాల్టీ షూటౌట్లతో నెగ్గింది.

తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు

ఇక కేన్‌, స్టోన్స్‌, లింగార్డ్‌ లాంటి టాప్ ప్లేయర్లు ఉన్న ఇంగ్లాండ్‌ జట్టుని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. స్వీడన్‌తో జరిగిన క్వార్టర్స్‌లో వారు అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ కీలకంగా వ్యవహారించాడు. 28 ఏళ్ల అనంతరం తొలి సెమీస్‌ ఆడబోతున్న ఇంగ్లండ్‌ దూకుడుకు నిజానికి ఆ జట్టు అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు సెమీస్‌లో క్రొయేషియా జట్టుతో కూడా గట్టి పోరు ఖాయమేననే ఇంగ్లాండ్ అభిమానులు భావిస్తున్నారు.

గోల్డెన్‌ బూట్‌ రేసులో హ్యారీ కేన్‌

మరోవైపు ఈ టోర్నీలో కెప్టెన్‌ హ్యారీ కేన్‌ గోల్స్‌ వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే అత్యధికంగా ఆరు గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ రేసులో అందరికన్నా ముందున్నాడు. ఈ మ్యాచ్‌లో కేన్ అద్భుత ప్రదర్శన చేస్తే క్రొయేషియాపై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడం ఖాయం. మిడ్‌ఫీల్డ్‌లో జోర్డాన్‌ హెండర్సన్‌ అండతో చెలరేగాలని జట్టు చూస్తోంది. క్రొయేషియా సెమీఫైనల్‌ దాకా రావడంలో అత్యంత కీలక పాత్ర మోద్రిచ్‌దే. సెమీస్‌లోనూ అతడు బాగా ఆడడం ఆ జట్టుకు చాలా ముఖ్యం.

అత్యంత కీలక పాత్ర మోద్రిచ్‌దే

ఇప్పటివరకు నాలుగు గోల్స్‌ కొట్టాడు. గ్రూప్‌ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా, నైజీరియాపై ఒక్కో గోల్‌ చేసిన మోద్రిచ్‌.. డెన్మార్క్‌, రష్యాలపై పెనాల్టీల్లో స్కోర్‌ చేశాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు. మోద్రిచ్‌కి తోడు మిడ్‌ఫీల్డర్‌ ఇవాన్‌ రకిటిచ్‌ కూడా ఎప్పటిలాగే రాణిస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. మిడ్‌ఫీల్డ్‌లో ఈ జోడీ సమన్వయంతో కదులుతూ తమ స్ట్రయికర్లకు పాస్‌లు ఇవ్వడంలో దిట్టగా ఉన్నారు.

సుబాసిచ్‌ రూపంలో ఉత్తమ గోల్‌కీపర్‌

డిఫెండర్లు డెజాన్‌ లోరెన్‌, విడా జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌‌ను అడ్డుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం. సుబాసిచ్‌ రూపంలో ఉత్తమ గోల్‌కీపర్‌ కూడా ఆ జట్టుకు ఉన్నాడు. ప్రిక్వార్టర్స్‌, క్వార్టర్స్‌లో క్రొయేషియా విజయాల్లో అతడి పాత్ర వెలకట్టలేనిది. పెనాల్టీలతో ఫలితం తేలిన ఆ మ్యాచ్‌ల్లో చక్కగా సేవ్‌లు చేయడంతో క్రొయేషియాకు హీరో అయ్యాడు. కాగా, క్రొయేషియా ఆటగాళ్ల గాయాలు ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇంగ్లాండ్‌ Vs క్రొయేషియా రెండో సెమీపైనల్

రాత్రి 11.30 నుంచి సోని టెన్‌-2, సోని టెన్‌-3, సోని ఈఎస్‌పీఎన్‌లో ప్రసారం

Story first published: Wednesday, July 11, 2018, 13:22 [IST]
Other articles published on Jul 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+