Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి వరకు ఉత్కంఠ: ఫిఫా వరల్డ్ కప్‌లో ఈజిప్ట్‌పై ఉరుగ్వే విజయం

FIFA World Cup 2018: Egypt 0-1 Uruguay

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఉరుగ్వే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా శనివారం ఈజిప్టు, ఉరుగ్వే జట్లు తలపడ్డాయి. ఎకతెరీన్‌బెర్గ్‌ ఎరీనాలో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై ఉరుగ్వే 1-0తేడాతో విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

89వ నిమిషం వరకు ఒక్క గోల్‌ నమోదు కాని ఈ మ్యాచ్‌లో రెండో అర్ధభాగంలో షాంచెజ్‌ ఇచ్చిన ఫ్రీకిక్‌ను గిమెంజ్‌ దానిని గోల్‌గా మలిచాడు. దీంతో ఉరుగ్వే శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. మ్యాచ్ అరంభం నుంచీ ఇరు జట్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. బంతిని ఎక్కువ సేపు తమ ఆధీనంలో ఉంచుకుని పలుమార్లు ఉరుగ్వే జట్టుకు గోల్ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

దీంతో తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ నమోదు కాకుండానే ముగిసింది. ఇక, రెండో అర్ధభాగంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఉరుగ్వే జట్టు 14 సార్లు ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై దాడులు చేయగా, ఈజిప్ట్ కేవలం 8 సార్లు మాత్రమే ఈ దాడులు చేసింది.

1
958023

రెండో అర్ధభాగంలో ఇరు జట్లు దూకుడుని మరితంగా పెంచాయి. మరో రెండు నిమిషాల్లో ఆట ముగిసి షూటౌట్‌కు వెళ్లే సమయంలో ఉరుగ్వేకు ఫ్రీ కిక్‌ రూపంలో అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఉరుగ్వే ఆటగాడు షాంచెజ్‌ ఇచ్చిన ఫ్రీకిక్‌ను గిమెంజ్‌ తలతో ముచ్చటైన రీతిలో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపాడు.

ఈ మ్యాచ్‌‌‌లో ఈజిప్ట్ 12 సార్లు అనవసర తప్పిదాలు చేయగా, ఉరుగ్వే 4 తప్పిదాలు మాత్రమే చేసింది. గోల్‌ కోసం ఉరుగ్వే ఆరు సార్లు ప్రయత్నించగా ఈజిప్ట్‌ గోల్‌ కీపర్‌ మహ్మద్ ఎల్-షెనవి వాటిని అడ్డుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ జట్టుకు చెందిన ఆటగాళ్లకు అంఫైర్ ఒకసారి ఎల్లో కార్డుని ప్రదర్శించాడు.

Story first published: Saturday, June 16, 2018, 12:38 [IST]
Other articles published on Jun 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+