మ్యాచ్ ఓడిన అభిమానుల మనసు గెలిచిన జపాన్ అభిమానులు

హైదరాబాద్: ఏ ఆటలోనైనా తమ జట్టు ఓడిపోతే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. పుట్‌బాల్‌లో అయితే దీని గురించి చెప్పాల్సిన పని లేదు. స్టేడియంలో హద్దులు దాటి ప్రత్యర్థులపై దాడులు చేసుకున్న ఘటనలను మనం ఎన్నో సార్లు చూశాం. అయితే, రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో మాత్రం జపాన్ అభిమానులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి బెల్జియం-జపాన్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య హోరాహోరాగా సాగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం 3-2 తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది. దీంతో జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. జపాన్ ఓటమి ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేసినా.. వాళ్లు తమ బాధ్యతను మాత్రం మరచిపోలేదు.
స్టేడియంలో ఉన్న చెత్తను మొత్తం శుభ్రం చేసి
బెల్జియంతో మ్యాచ్ ముగిసిన వెంటనే ఎప్పటిలాగే స్టేడియంలో ఉన్న చెత్తను మొత్తం శుభ్రం చేసి వెళ్లారు. రష్యా వరల్డ్ కప్‌లో జపాన్ అభిమానులు తమ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా స్టేడియాలను శుభ్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. జపాన్ సాకర్ అభిమానులు చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
జపాన్ పౌరుల క్రమశిక్షణ ప్రపంచాన్ని మెప్పిస్తోంది
మిగతా దేశాలకు చెందిన సాకర్ అభిమానులు ఇలా ఎందుకు చేయకూడదు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి జపనీయులు శుభ్రతకు పెట్టింది పేరు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మిగతా దేశాలతో పోలిస్తే జపాన్ వాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. జపాన్ పౌరుల క్రమశిక్షణ ప్రపంచాన్ని మెప్పిస్తోంది.
వెనువెంటనే రెండు గోల్స్ చేసిన జపాన్
సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో రెండో అర్ధభాంగా ఆసక్తిగా మారింది. రెండో అర్దభాగం ప్రారంభమైన కాసపటికే జపాన్ వెనువెంటనే రెండు గోల్స్ చేసింది. ఆట 48వ నిమిషంలో హరగూచీ, 52వ నిమిషంలో ఇన్నూ గోల్స్ చేసి జపాన్‌కు ఆధిక్యాన్ని అందించారు.
బెల్జియం గెలవడం అసాధ్యమనే భావించారు
దీంతో ఈ దశలో బెల్జియం గెలవడం అసాధ్యమనే అంతా భావించారు. అయితే చివర్లో బెల్జియం ఒక్కసారిగా దూకుడును ప్రదర్శించింది. 69వ నిమిషంలో వెర్టోంజన్, 74వ నిమిషంలో ఫెల్లయిని, 90వ నిమిషంలో చాడ్లీలు గోల్స్ చేసి బెల్జియానికి విజయాన్ని అందించారు. రెండు గోల్స్ తేడాతో వెనుకబడి ఉన్న బెల్జియం.. ఆ తర్వాత ఊహించని రీతిలో కోలుకుని జపాన్‌ను ఓడించింది. ఈ ఓటమి వేధిస్తున్నప్పటికీ జపాన్ అభిమానులు ఎప్పటిలాగే తమ బాధ్యతను నిర్వర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications