Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ నుంచి ఒకేరోజు నిష్క్రమణ: రొనాల్డో-మెస్సీలపై జోకులు

FIFA World Cup 2018: Cristiano Ronaldo, Lionel Messi’s exit sends Twitter into overdrive

హైదరాబాద్: వారిద్దరూ ప్రపంచంలో అత్యుత్తమ పుట్‌బాలర్లు. పుట్ బాల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బాలన్ డీ ఓర్ అవార్డును ఇద్దరూ ఐదేసిసార్లు గెలుచుకున్నారు. గోల్ కొడితే గురి తప్పడం అరుదు. దశాబ్ద కాలానికి పైగా ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను మైమరిపించిన ఆ ఇద్దరూ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఫిఫా వరల్డ్ కప్‌ ప్రారంభానికి ముందు నుంచే ఈ పేర్లు ప్రపంచమంతా హోరెత్తాయి. రష్యా వేదికగా జరుగుతున్న 21వ వరల్డ్ కప్‌లో తమ దేశాలకు వరల్డ్ కప్ అందించాలని బరిలోకి దిగారు. కానీ.. అది నెరవేరలేదు. మెస్సీ, రొనాల్డోలు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఒకే రోజు నిష్క్రమించాయి.

శనివారం జరిగిన రెండు ప్రిక్వార్టర్స్ మ్యాచుల్లో ఈ ఇద్దరూ కెప్టెన్లుగా ప్రాతినిథ్యం వహిస్తోన్న జట్లు ఓడిపోయాయి. ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా, ఉరుగ్వే చేతిలో పోర్చుగల్ ఓడిపోయి ఇంటిదారి పట్టాయి. దీంతో సోషల్‌ మీడియా వేదికగా మెస్పీ, రొనాల్డోలపై జోకుల వర్షం కురుస్తోంది. ఒక్కో అభిమాని ఒక్కోలా ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు.

ఇద్దరూ ఒకేసారి ఓడిపోవడంతో ఒకే రోజు ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుంటే ఎలా ఉంటుందో చూడండి అంటూ ఫన్నీ ట్వీట్లతో కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 'రొనాల్డో-మెస్సీలు ఎయిర్‌పోర్ట్‌లు ఎదురుపడితే అది కచ్చితంగా జోక్‌గా నిలిచిపోతుంది' అని ఓ అభిమాని చమత్కరించాడు.

మరొక అభిమాని 'ఏనాడు వరల్డ్‌కప్‌ నాకౌట్‌ గేమ్‌ల్లో ఒక్క గోల్‌ కూడా చేయని వీరిద్దరూ ఒకే రోజు ఒకే రకంగా వరల్డ్‌ కప్‌ను వీడారు' అంటూ ట్వీట్ చేశాడు. 'రొనాల్డ్‌ జట్టుతో మెస్సీ ఆడినట్లయితే అంతర్జాతీయ గోల్స్‌ కంటే కూడా ఎక్కువసార్లు వీడ్కోలు ప్రకటించే అవకాశం దక్కేది'అని మరొక అభిమాని విమర్శించాడు.

'ఈరోజు రాత్రి వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి' అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. రొనాల్డో-మెస్సీలు ఎయిర్‌పోర్ట్‌లు కలిస్తే ఇలానే ఉంటుందంటూ రెండు మేకలు ఉన్న ఫొటోను మరొక నెటిజన్ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Story first published: Sunday, July 1, 2018, 14:04 [IST]
Other articles published on Jul 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+