నెయ్‌మార్ డైవ్ చేస్తే పెగ్గు మందు ఫ్రీ: బ్రెజిల్ పబ్ వెరైటీ ఆఫర్

హైదరాబాద్: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రపంచ వ్యాప్తంగా సాకర్ అభిమానులను ఊర్రుతలూగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సాకర్ ఫీవర్‌ను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి పలు వ్యాఫార సంస్ధలు. తాజాగా, ఫిపా వరల్డ్ కప్ సందర్భంగా బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలోని ఓ బార్ వెరైటీ ఆఫర్ పెట్టింది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
నేయ్‌మార్ డైవ్ చేసిన ప్రతిసారీ
టోర్నీలో భాగంగా బుధవారం జరిగే బ్రెజిల్-సెర్బియా మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేయ్‌మార్ డైవ్ చేసిన ప్రతిసారీ.. కస్టమర్లకు ఒక పెగ్గు మందును ఉచితంగా ఇస్తామని తెలిపింది. ఈ మేరకు రియో డి జెనీరోలోని సర్ వాల్టర్ పబ్ యాజమాన్యం తన ఫేస్‌బుక్ పేజిలో ఓ పోస్టులో పేర్కొంది.

మందుబాబులకు మాత్రం సరికొత్త ఆఫర్
నెయ్‌మార్ డైవ్స్ సాకర్ అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, మందుబాబులకు మాత్రం ఈ ఆఫర్ సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో నెయ్‌మార్ తన స్థాయికి దగ్గర ప్రదర్శన చేయడం లేదు. టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క గోల్ చేశాడు.

ఒకే ఒక్క గోల్ చేసిన నెయ్‌మార్
అది కూడా కోస్టారికాపై అదనపు సమయంలో గోల్ చేయడం విశేషం. ఐదుసార్లు చాంపియన్‌గా ఉన్న బ్రెజిల్ ఈ సీజన్‌లో అంతంత మాత్రంగానే రాణిస్తోంది. టోర్నీలో భాగంగా బ్రెజిల్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, మరొక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

కోస్టారికాపై 2-0తేడాతో విజయం సాధించిన బ్రెజిల్
తొలి మ్యాచ్‌లో పసికూన స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించుకున్న బ్రెజిల్, కోస్టారికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 2-0తేడాతో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో నెయ్‌మార్ అవసరం లేకున్నా, ప్రతిసారీ గ్రౌండ్‌లో డైవ్ చేస్తుండటంతో వినూత్నంగా ఆలోచించిన సర్ వాల్టర్ పబ్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. నెయ్‌మార్ డైవ్‌లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. కాగా, టోర్నీలో భాగంగా మూడో మ్యాచ్ బుధవారం రాత్రి సెర్బియాతో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications