Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA Women's World Cup 2023: విశ్వ విజేతగా స్పెయిన్.. ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు!

సిడ్నీ: ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2023 టోర్నీలో స్పెయిన్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఫిఫా ప్రపంచకప్ అందుకోవడం స్పెయిన్ మహిళా జట్టుకు ఇదే తొలిసారి. మ్యాచ్ 29వ నిమిషంలో ఓల్గా క్యార్‌మోనా చేసిన ఏకైక గోల్.. స్పెయిన్ విజయానికి బాటలు వేసింది.

ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమ్ తుది పోరులో తడబడి త‌ృటిలో టైటిల్ చేజార్చుకుంది. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఫైనల్ ఒత్తిడిని తట్టుకోలేకపోయిన ఇంగ్లండ్ ప్లేయర్లు.. బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో విఫలమయ్యారు.

 FIFA Womens World Cup 2023

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించిన స్పెయిన్ మాత్రం అద్వితీయమైన ఆటతో దుమ్మురేపింది. మ్యాచ్ 29వ నిమిషంలోనే గోల్ కొట్టి ఆత్మవిశ్వాసాన్ని డబుల్ చేసుకుంది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లండ్ గోల్ పోస్ట్‌పై పదే పదే దాడులు చేసింది.

ఇంగ్లండ్ ప్రయత్నాలను స్పెయిన్ డిఫెన్స్ విభాగం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌లను కూడా స్పెయిన్ గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకుంది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో తొలి గోల్ చేసిన స్పెయిన్ సారథి ఓల్గా క్యారమోనా.. ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి మరో గోల్ కొట్టింది.

దాంతో ఫస్టాఫ్ 1-0తో ముగియగా.. సెకండాఫ్‌లో ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి.

Story first published: Sunday, August 20, 2023, 20:05 [IST]
Other articles published on Aug 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+