Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: సెర్బియాపై స్విట్జర్లాండ్‌ విజయం, నాకౌట్‌కు వెళ్లాలంటే!

FIFA WC 2018: Serbia 1-2 Switzerland, Highlights: Shaqiri late strike clinches crucial comeback win

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఆసక్తిరకంగా సాగుతున్నాయి. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి సెర్బియా-స్విట్జర్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 2-1 తేడాతో సెర్బియాపై విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆట 90వ నిమిషంలో జిర్దాన్ షాకిరి చేసిన సూపర్ సోలో గోల్‌తో స్విస్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. హాఫ్‌వే గ్రౌండ్ నుంచి బంతిని డ్రిబ్లింగ్ చేసిన షాకిరి డిఫెన్స్‌ను చేధిస్తూ అద్భుతమైన గోల్ చేసి విజయాన్ని అందించాడు. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాలకే సెర్బియా ఆటగాడు అలెగ్జాండర్‌ మిట్రోవిక్ గోల్‌ చేసి సెర్బియాకు ఆ జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఆ తర్వాత జరిగిన ఆటలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ప్రత్యర్ధి గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ, ఏ జట్టు గోల్‌ చేయలేదు. అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగంలో స్విట్జర్లాండ్ దూకుడుగా ఆడింది. 52వ నిమిషంలో స్విస్‌ ఆటగాడు గ్రానిట్‌ హాకా గోల్‌ చేసి ఆధిక్యాన్ని సమం చేశాడు.

1
958048

దీంతో ఆట రసవత్తరంగా సాగింది. 90వ నిమిషంలో స్విట్జర్లాండ్‌ మిడ్‌ ఫీల్డర్‌ షకిరి మరో గోల్‌ చేయడంతో ఆ జట్టు 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంజూరీ సమయంలో సెర్బియా గోల్‌ చేయకపోవడంతో విజయం స్విస్‌ సొంతమైంది. తాజా విజయంతో గ్రూప్‌-ఈలో ఉన్న స్విట్జర్లాండ్‌ 4 పాయింట్లతో బ్రెజిల్‌తో పాటు సమానంగా ఉంది.

అయితే గోల్ డిఫెరెన్స్ తేడా వల్ల ప్రస్తుతం స్విస్ రెండవ స్థానంలో స్థానంలో కొనసాగుతుండగా... బ్రెజిల్‌ అగ్రస్థానంలో ఉంది. టోర్నీలో భాగంగా కోస్టా రికాతో డ్రా చేసుకుంటే స్విట్జర్లాండ్ నాకౌట్‌క్ అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ గెలిస్తే, అప్పుడు బ్రెజిల్ మీద సెర్బియా గెలిస్తే ఆ జట్టు ముందుకు వెళ్తుంది.

Story first published: Saturday, June 23, 2018, 12:10 [IST]
Other articles published on Jun 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+