
హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో స్విట్జర్లాండ్ నాకౌట్‌కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా బుధవారం గ్రూప్-ఈలో స్విట్జర్లాండ్-కోస్టారికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 2-2 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ డ్రా చేసుకుంది. దీంతో గ్రూప్‌లో స్విట్లర్లాండ్ రెండవ స్థానంలో నిలిచింది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే గోల్ కొట్టేందుకు ఇరు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. తొలి అర్ధభాగంలో స్విట్జర్లాండ్ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో 31వ నిమిషంలో స్విట్జర్లాండ్ ఆటగాడు బెరిమ్ జిమైలి గోల్ చేసి ఆ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కోస్టారికా ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై పదే పదే దాడి చేసినప్పటికీ ఆ జట్టుకు గోల్ దక్కలేదు.
దీంతో తొలి అర్దభాగం ముగిసే సరికి స్విట్జర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగం 56వ నిమిషంలో కెండల్ వాట్సన్.. కోస్టారికాకు గోల్ అందించి స్కోరు సమం చేశాడు. అయితే 88వ నిమిషంలో డిమ్రిక్ గోల్ చేసి స్విట్జర్లాండ్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. మరి కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా డ్రామా చోటుచేసుకుంది.
ఈ క్రమంలో కోస్టారికాకు పెనాల్టీ వచ్చింది. ఆ పెనాల్టీ అవకాశాన్ని కోస్టారికా గోల్‌గా మలుచుకుంది. దీంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. అయితే పాయింట్ల ఆధారంగా కోస్టారికా గ్రూప్‌లో రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పటికే గ్రూప్-ఈలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్‌తో పాటు స్విట్జర్లాండ్ నాకౌట్‌కు అర్హత సాధించింది. నాకౌట్‌లో స్వీడన్‌తో స్విట్జర్లాండ్ తలపడనుంది.