Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: నాకౌట్‌కు బెల్జియం, టునిషియాపై 5-2తో విజయం

Hazard

హైదరాబాద్: ర‌ష్యా వేదిక‌గా జ‌రుగుతున్న‌ ఫిఫా వరల్డ్ కప్‌లో బెల్జియం చెలరేగిపోతోంది. టోర్నీలో భాగంగా గ్రూప్‌-జిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టునిషియాపై 5-2తో ఘనవిజయం సాధించింది. టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి నాకౌట్‌కు అర్హత సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

తొలి మ్యాచ్‌లో పనామాపై డబుల్‌ గోల్స్‌తో మెరిసిన స్టార్‌ స్ట్రైకర్‌ రొమెలు లుకాకు ఈ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయాడు. ఆట ఆరంభం నుంచే బెల్జియం ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్న ఆ జట్టు.. టునిషియా డిఫెండర్లను ఒత్తిడిలోకి నెడుతూ వచ్చారు.

ఆరో నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్ కొట్టి బెల్జియంను ఆధిక్యంలో నిలిపాడు. 16వ నిమిషయంలో రొమెలు లుకాకు మరో గోల్ కొట్టి ఆధిక్యాన్ని మరింతగా పెంచాడు. రెండు నిమిషాల వ్యవధిలోనే(18వ) ట్యునిషియా ప్లేయర్ బ్రాన్ గోల్ చేసి ట్యునిషియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. ముఖ్యంగా రెండో సెషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించారు.

1
958060

అనంతరం బెల్జియం తరఫున 45వ నిమిషంలో రొమెలు లుకాకు, 51వ నిమిషంలో ఎడెన్ హజార్డ్, 90వ నిమిషంలో మిచీ బత్సుయే గోల్ చేశారు. ఈ క్రమంలో తొలి అర్ధభాగంలోనే బెల్జియం మూడు గోల్‌లు నమోదు చేసి జోరు కొనసాగించింది. మరోవైపు టునిషియా తరఫున బ్రూన్‌(18నిమిషంలో), ఖజ్రీ(90+3) చెరో గోల్‌ సాధించారు.

చివరి 20 నిమిషాల్లో ట్యునిషియా గోల్ పోస్ట్‌పై బెల్జియం ఆట‌గాళ్లు వరుసగా దాడులు చేశారు. బంతిని ఎక్కువసేపు నియంత్రణలో ఉంచుకుంటూ స్కోరును పెంచేందుకు ప్రయత్నించారు. మరోవైపు మ్యాచ్‌ ముగిసే సమయానికి టునిషియా ఆటగాడు ఖజ్రీ గోల్ నమోదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బెల్జియం 5-2తో విజయం సాధించింది.

తాజా విజయంతో బెల్జియం వరుసగా రెండో విజయంతో దర్జాగా నాకౌట్‌లోకి అడుగుపెట్టగా... తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ట్యునిషియాకు మరో ఓటమి తప్పలేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘోర పరాభవాన్ని ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Saturday, June 23, 2018, 20:25 [IST]
Other articles published on Jun 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+