ఫిఫాలో సంచలనం: మెస్సీతో పాటు రోనాల్డో కూడా ఇంటికి

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఎన్నో అంచనాల నడుమ సాకర్ సమరంలో అడుగుపెట్టిన పోర్చుగల్ నాకౌట్ దశలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకముందు జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా జట్టు 4-3తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
దీంతో శనివారం జరిగిన నాకౌట్ మ్యాచ్‌ల్లో ప్రపంచ అగ్రశ్రేణి జట్లు అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరోవైపు ఫ్రాన్స్, ఉరుగ్వే జట్లు క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో నాకౌట్ పోరులొ ఉరుగ్వే 2-1తో పోర్చుగల్‌పై ఘన విజయం సాధించింది.
దీంతో తొలి క్వార్టర్ ఫైనల్‌లో జులై 6న ఫ్రాన్స్‌తో ఉరుగ్వే తలపడనుంది. ఉరుగ్వే ప్లేయర్ ఎడిసన్ కవానీ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో వరల్డ్‌కప్‌లో క్రిస్టియానో రోనాల్డో షో ముగిసింది. గ్రూప్ స్టేజ్‌లో నాలుగు గోల్స్ చేసి పోర్చుగల్‌ను ముందుకు నడిపించిన రోనాల్డో.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు.

మ్యాచ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే
మ్యాచ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే ఉరుగ్వే ఫార్వర్డ్ ప్లేయర్ ఎడిన్సన్ కావనీ తొలి గోల్ చేసి పోర్చుగల్‌కు షాకిచ్చాడు. సువారెజ్ ఇచ్చిన పాస్‌ను ఈ స్టార్ స్ట్రైకర్ హెడర్ గోల్ చేసి ఉరుగ్వేను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత తొలి అర్దభాగంలో రెండు జట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. ఈ క్రమంలో కిక్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రొనాల్డో మిస్ చేశాడు.

మరో గోల్ నమోదు కాకుండానే ముగిసిన తొలి అర్దభాగం
ఆ తర్వాత ఇరు జట్లకు గోల్స్ దక్కలేదు. దీంతో మరో గోల్ నమోదు కాకుండానే తొలి భాగం ముగిసింది. ఇక, రెండో అర్దభాగంలో 55వ నిమిషంలో రొనాల్డో ఇచ్చిన పాస్‌తో డిఫెండర్ పెపె గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్ సమం అయ్యాయి. అయితే, పోర్చుగల్ శిభిరంలో ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు.

62వ నిమిషంలో మరో అద్భుతమైన గోల్
పోర్చుగల్ డిఫెండింగ్ వైఫల్యంతో ఎడిన్సన్ కావనీ 62వ నిమిషంలో మరో అద్భుతమైన గోల్ చేయడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ కోసం పోటీపడినప్పటికీ గోల్స్ నమోదు కాలేదు. ఆటలో భాగంగా 63 శాతం బంతి పోర్చుగల్ ఆధీనంలో ఉన్నప్పటికీ గోల్స్ నమోదు చేయటంలో పోర్చుగల్ స్టైకర్లు పూర్తిగా విఫలమయ్యారు.
రొనాల్డోకు ఎల్లో కార్డు చూపించిన రిఫరీలు
ఈ మ్యాచ్‌లో ఏకైక ఎల్లో కార్డు రిఫరీలు రొనాల్డోకు చూపించారు. ఆటలో భాగంగా పోర్చుగల్ జట్టు 12 అనవసర తప్పిదాలకు పాల్పడగా... ఉరుగ్వే జట్టు 13 అనవసర తప్పిదాలు చేసింది. ఇక ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్ నమోదు చేయలేకపోయిన పోర్చుగల్ ఓటమితో నిష్క్రమించింది. శుక్రవారం ఫ్రాన్స్, ఉరుగ్వే మధ్య క్వార్టర్స్ మ్యాచ్ జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications