For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నైజీరియా సెల్ఫ్‌ గోల్‌: 20 ఏళ్ల తర్వాత క్రొయేషియా శుభారంభం

By Nageshwara Rao
FIFA WC 2018 Highlights: Croatia elbow out listless Nigeria 2-0

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా శుభారంభం చేసింది. దీంతో రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌లో తాము ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌లోనే క్రొయేషియా విజయం సాధించింది. గ్రూప్‌-డి మ్యాచ్‌లో క్రొయేషియా 2-0తో నైజీరియాను ఓడించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

నైజీరియా ఆటగాడు ఒగెనెకరో ఎటెబో చేసిన సెల్ఫ్‌ గోల్‌తో క్రొయేషియా ఆధిక్యం సాధించగా, ఆ తర్వాత 71వ నిమిషంలో కెప్టెన్‌ మోడ్రిక్‌ గోల్‌తో క్రొయేషియా 2-0తో ఆధిక్యాన్ని సాధించింది. ఆట 32వ నిమిషంలో అంటె రెబిక్, మరియో మండ్‌జుకిక్‌నుంచి బంతిని అందుకునే క్రమంలో కార్నర్ వద్ద అనూహ్యంగా ఎటెబో తమ గోల్‌పోస్ట్‌లోకే గోల్‌ కొట్టాడు.

దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి క్రొయేషియా 1-0తో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో క్రొయేషియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్లు డెజన్‌ లొవ్రెన్, ఒడియన్‌ ఇగాలో బంతిని నైజీరియా గోల్ పోస్టువైపే ఆడారు. ఈ క్రమంలో పలుమారుల్ గోల్స్ కొట్టేందుకు ప్రయత్నించినా ప్రత్యర్థి జట్లు డిఫెండర్లు వారిని నిలువరించారు.

ఫలితంగా 59వ నిమిషంలోగానీ నైజీరియా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ వద్ద గోల్‌గా మలచలేకపోయింది. ఆ తర్వాత నైజీరియా డిఫెండర్‌ విలియమ్‌ ట్రూస్ట్‌ ఎకాంగ్‌ కార్నర్‌ వద్ద క్రొయేషియా ఫార్వర్డ్‌ ఆటగాడు మరియో మండ్‌జుకిక్‌ను కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. ఆట 71వ నిమిషంలో మోడ్రిక్‌ దానిని గోల్‌గా మలచడంతో క్రొయేషియా 2-0తో విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో నైజీరియా జట్టు ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ కప్‌ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 'సెల్ఫ్‌ గోల్‌' చేసిన ఏకైక జట్టుగా నైజీరియా నిలిచింది. చివరిసారి 2014 ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ జట్టుపై ఇదే విధంగా నైజీరియా సెల్ఫ్‌ గోల్‌ సాధించింది.

మరోవైపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం క్రొయేషియాకిదే తొలిసారి. చివరిసారి 1998లో అరంగేట్రం మ్యాచ్‌లో క్రొయేషియా 3-1తో జమైకాను ఓడించింది.

Story first published: Monday, June 18, 2018, 10:11 [IST]
Other articles published on Jun 18, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+