Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: 82 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై బెల్జియం గెలుపు

FIFA WC 2018: Highlights: Belgium top Group G after 1-0 win over England

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో గురువారం బెల్జియం-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. సాదాసీదాగా సాగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం 1-0తో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో 82 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై బెల్జియం విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

1936లో జరిగిన వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచిన బెల్జియం తాజాగా రెండో సారి గెలుపొందింది. మొత్తంగా వరల్డ్ కప్‌లో ఇరుజట్లు 22సార్లు తలపడగా బెల్జియం కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించడం విశేషం. గ్రూప్ టాపర్ కోసం జరిగిన ఈ పోరులో ఇరుజట్లు నెమ్మదిగా ఆడాయి.

దీంతో సాకర్ అభిమానులకు సైతం విసుగుపుట్టింది. అంతేకాదు తొలి అర్ధభాగం ముగిసే సరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇరు జట్లకు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్లు పలుమార్లు ప్రత్యర్ధి గోల్ పోస్టుపై దాడి చేసినప్పటికీ డిఫెండర్లు సమర్ధవంతంగా అడ్డుకున్నారు.

రెండో అర్ధభాగం మొదలైన ఆరు నిమిషాలకు బెల్జియం ఆటగాడు అద్నాన్‌ జనుజాజ్‌.. ఇంగ్లండ్‌ పెనాల్టీ ఏరియా మీదుగా ఆటగాళ్ల గ్యాప్‌ నుంచి కళ్లు చెదిరే రీతిలో గోల్‌ చేశాడు. దీంతో బెల్జియం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిసే సమయానికి మరో గోల్ నమోదు చేయకపోవడంతో బెల్జియం విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో బెల్జియం 14 అనవసర తప్పిదాలు చేయగా, ఇంగ్లాండ్‌ 11 సార్లు అనవసరం తప్పిదాలకు పాల్పడింది. రిఫరీలు బెల్జియం ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. తాజా విజయంతో ఈ గ్రూప్ నుంచి గ్రూప్ టాపర్‌గా నిలిచిన బెల్జియం, రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ నాకౌట్‌కు అర్హత సాధించాయి.

జలై 2న జరిగే నాకౌట్‌ మ్యాచ్‌లో బెల్జియం జట్టు జపాన్‌తో తలపడనుంది. ఇక, ఈ పోరులో ఓటమిపాలైన ఇంగ్లాండ్ జులై 3న కొలంబియాతో తలపడనుంది.

Story first published: Friday, June 29, 2018, 10:01 [IST]
Other articles published on Jun 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+