Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

థ్రిల్లింగ్ పెనాల్టీస్: 1998 తర్వాత క్వార్టర్స్‌కు తొలిసారి క్రొయేషియా

FIFA 2018: Croatia in quarter-finals after thrilling penalties climax

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్ కప్‌లో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లను సాకర్ అభిమానులు ఎంజాయ్ చేశారు. ఈ రెండు మ్యాచ్‌లు పెనాల్టీ షూటౌట్ల ద్వారానే ఫలితాన్ని రాబట్టడం విశేషం. టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌పై 4-3తేడాతో విజయం సాధించి 48 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌ చేరింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆ తర్వాత రాత్రి జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా కూడా డెన్మార్క్‌పై 3-2 తేడాతో విజయం సాధించి 20 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌ చేరింది. ఆదివారం నిజ్ని నోవ్‌గోరోడ్ స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో క్రొయేషియా 3-2 స్కోరు (పెనాల్టీ షూటౌట్‌)తో డెన్మార్క్‌ను ఓడించింది.

నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్‌ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఆట ప్రారంభమైన వెంటనే ఇరు జట్లు గోల్స్ నమోదు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.

1
958073

ఈ క్రమంలో డెన్మార్క్‌ ఆటగాడు మతియాస్‌ జార్జినసన్‌ గోల్‌ చేయడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 4వ నిమిషంలో మరియో మాండ్‌జుకిక్‌ గోల్‌ చేయడంతో క్రొయేషియా స్కోరును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో డెన్మార్క్ బంతిని ఎక్కువ భాగం తన నియంత్రణలో ఉంచుకున్నా, గోల్స్ నమోదు చేయడంలో విఫలమైంది.

మరోవైపు క్రొయేషియా ప్రత్యర్ధి జట్టు గోల్‌ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది. నిర్ణీత సమయంతో పాటు, ఇంజురీ సమయంలోనూ గోల్‌ నమోదు కాకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో క్రొయేషియా ఆటగాళ్లు ఆండ్రెజ్ క్రమారిక్‌, లుకా మాడ్రిక్‌, ఇవాన్‌ రాకిటిక్‌ గోల్స్‌ సాధించి క్రొయేషియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.

మరోవైపు ఒత్తిడిలో డెన్మార్క్‌ గోల్స్‌ సాధించలేకపోయింది. దీంతో 3-2 తేడాతో క్రొయేషియా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో క్రొయేషియా 5 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడగా... డెన్మార్క్ జట్టు 19 సార్లు తప్పిదాలకు పాల్పడి మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకుంది.

1998 తర్వాత ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌ చేరడం క్రియేషియాకు ఇదే మొదటిసారి. అంతేకాదు ఆట ప్రారంభమైన నాలుగు నిమిషాల్లోపే రెండు జట్లు గోల్‌ సాధించడం ప్రపంచకప్‌ చరిత్రలోనే ఇది రెండోసారి. 2014 ప్రపంచకప్‌లో అర్జెంటీనా-నైజీరియా జట్లు నాలుగు నిమిషాల్లోపే గోల్‌ సాధించాయి.

Story first published: Monday, July 2, 2018, 12:14 [IST]
Other articles published on Jul 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+