Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క గోల్.. ఖేల్ ఖతమ్! ఫిఫా చరిత్రలో గోల్డెన్‌ గోల్‌ సంచలనాలు!

గత 39 రోజులుగా సాగిన ఫుట్‌బాల్ మహా సంగ్రామం‌లో విజేత‌ను ఒకే ఒక్క గోల్‌ నిర్ణయించింది. అద్వితీయమైన పోరాటంతో ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్ చేరిన ఇరు జట్లకు తేడా జస్ట్ ఆ ఒక్క గోల్ మాత్రమే. ఒక్క కిక్‌.. ఆ ఒక్క క్షణం.. అంతే మ్యాచ్‌ చరిత్ర మారిపోయింది. ఆ గోల్డెన్ గోల్.. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ యూరోపియన్ దేశమైన స్పెయిన్‌కు విశ్వకిరీటాన్ని అందించింది.

FIFA World Cup 2026 ఫైనల్లో ఓటమి.. మైదానంలోనే కొట్టుకున్న ఆటగాళ్లు! (వీడియో)

FIFA World Cup 2026 ఫైనల్లో ఓటమి.. మైదానంలోనే కొట్టుకున్న ఆటగాళ్లు! (వీడియో)

వరుసగా టైటిల్ నిలబెట్టుకోని బ్రెజిల్ రికార్డ్‌ను సమం చేయాలని భావించిన అర్జెంటీనా ఆశలను చిదిమేసింది. 39 ఏళ్ల వయసులో ప్రపంచకప్ విజయంతో సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలని భావించిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలోనే కాదు.. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఎన్నో మ్యాచ్‌ల ఫలితాన్ని ఈ గోల్డెన్ గోల్ శాసించింది.

Fans Recall the Golden Goal Rule After Spain s Extra-Time Winner Seals Second FIFA World Cup Title

గోల్డెన్ గోల్ అంటే..

గతంలో నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోతే.. అదనపు సమయంలో ముందుగా గోల్ చేసే జట్టును విజేతగా ప్రకటించేవారు. అందుకే ఈ గోల్‌ను గోల్డెన్ గోల్‌గా పిలిచేవారు. ఈ గోల్డెన్ గోల్ కొన్ని దశాబ్దాల పాటు సంచలనాలు సృష్టించింది. అయితే ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు రావడంతో ఫిఫా ఈ విధానాన్ని పక్కనపెట్టింది. ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఇరు జట్లకు సమాన అవకాశాలు ఇచ్చింది. అక్కడ ఫలితం తేలకపోతే.. పెనాల్టీ షూటౌట్‌ ద్వారా విజేతను నిర్ణయించే పద్దతిని తీసుకొచ్చింది. అయినా ఎక్స్‌ట్రా టైమ్‌లో ఒక్క గోల్‌తో గెలిచినప్పుడు ఫుట్‌బాల్ అభిమానులు గోల్డెన్ గోల్‌గా పరిగణిస్తున్నారు.

గోల్డెన్ గోల్ సంచలనాలు..

1998 ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి గోల్డెన్ గోల్ నమోదైంది. ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన ఆ టోర్నీలో ఫ్రాన్స్‌-పరాగ్వే మధ్య జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అదనపు సమయానికి దారి తీసింది. ఈ ఎక్స్‌ట్రా టైమ్‌లో లారెంట్‌ బ్లాంక్‌ చేసిన గోల్డెన్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌ చరిత్రలో నమోదైన తొలి గోల్డెన్‌ గోల్‌గా ఇది నిలిచింది.

2002 ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా గోల్డెన్‌ గోల్ నమోదైంది. సౌత్ కొరియా, ఇటలీ మధ్య జరిగిన ప్రీ-క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అత్యంత వివాదాస్పదంగా సాగించింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో కొరియా ప్లేయర్ ఆన్ జంగ్ హ్యాన్ చేసిన గోల్డెన్ గోల్‌తో ఇటలీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఎక్కువగా చర్చించుకునే మ్యాచ్‌ల్లో ఇది ఒకటిగా నిలిచింది.

యూరో కప్ 2000 ఫైనల్ ఫలితం కూడా గోల్డెన్ గోల్ రూల్‌తోనే తేలింది. ఇటలీతొ జరిగిన ఈ ఫైనల్లో ఫ్రాన్స్ గోల్డెన్ గోల్‌తో టైటిల్ అందుకుంది.

FIFA World Cup 2026: స్పెయిన్‌కు రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ.. అవార్డుల పూర్తి జాబితా ఇదే!

FIFA World Cup 2026: స్పెయిన్‌కు రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ.. అవార్డుల పూర్తి జాబితా ఇదే!

2003 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లోనూ..

2003 మహిళల ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ జర్మనీ గోల్డెన్ గోల్‌తో స్వీడన్‌ను ఓడించింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో నియా కుంజర్‌ చేసిన గోల్డెన్‌ గోల్‌తో జర్మనీ గెలుపొందింది.

గోల్డెన్‌ గోల్‌ నిబంధన ఎక్కువ కాలం కొనసాగకపోయినా.. ఆ సమయంలో నమోదైన కొన్ని గోల్స్‌ ఫుట్‌బాల్‌ అభిమానుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఎందుకంటే అవి కేవలం గోల్స్‌ కాదు.. ఒక జట్టు కలలను నిజం చేసిన క్షణాలు.. మరో జట్టు ఆశలను ఒక్క కిక్‌తో సమాధి చేసిన గడియలు. తాజా ప్రపంచకప్ ఫైనల్లో 106వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ ఫెర్రాన్ టొర్రెస్ చేసిన గోల్ 'గోల్డెన్ గోల్'ను తలపించింది.

Story first published: Monday, July 20, 2026, 9:42 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+