Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Euro Cup 2024 ఛాంపియన్ స్పెయిన్.. ఫైనల్లో ఇంగ్లండ్‌ ఓటమి!

ప్రతిష్టాత్మక యూరో కప్ 2024 ఫుట్ బాల్ టోర్నీ‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన స్పెయిన్.. టైటిల్ ఫైట్‌లోనూ అదే ఆధిపత్యం కనబర్చింది.

స్పెయిన్ తరఫున నికో విలియమ్స్(47వ నిమిషం), మైకెల్ ఒయర్జాబల్(86వ నిమిషం) గోల్స్ నమోదు చేయగా.. ఇంగ్లండ్ తరఫున కోలె పాలెమెర్(73వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు.

Euro Cup 2024 Spain Beat England 2-1 In Thrilling Final To Clinch Record 4th Title

గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్ మరోసారి ఫైనల్లోనే ఓడింది. స్పెయిన్ మాత్రం వరుసగా నాలుగోసారి యూరో కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఫస్టాఫ్‌ వరకు ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. కానీ ఏ జట్టు గోల్ నమోదు చేయలేకపోయింది.

సెకండాఫ్ ప్రారంభమైన రెండు నిమిషాలకే 47 నిమిషాల వద్ద స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్ నికో విలియమ్స్ అద్భుత గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచాడు.
73 నిమిషాల వద్ద ఇంగ్లాండ్ ప్లేయర్ కోలె పాలెమెర్ గోల్ కొట్టడంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక 86వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ మైకెల్ ఒయర్జాబల్ గోల్ కొట్టడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు అదే ఆధిక్యాన్ని కాపాడుకున్న స్పెయిన్ విజయం సాధించడంతో పాటు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అదరనపు సమయంలోనూ ఇంగ్లండ్ గోల్ చేయలేకపోయింది.

బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన స్పెయిన్.. ఇంగ్లండ్ రక్షణ శ్రేణిని ఛేదిస్తూ పదే పదే గోల్ పోస్ట్‌లోకి దాడి చేసింది. దాంతో ఇంగ్లండ్ డిఫెన్సివ్ మోడ్‌లో ఆడి మూల్యం చెల్లించుకుంది.

ఈ మ్యాచ్‌లో స్పెయిన్ 16 షాట్స్ ఆడగా.. ఇంగ్లండ్‌ 9 మాత్రమే కొట్టింది. లక్ష్యంవైపు స్పెయిన్ 6 షాట్స్ కొట్టగా.. ఇంగ్లండ్ నాలుగుకే పరిమితమైంది. స్పెయిన్ 11 సార్లు ఫౌల్ చేస్తే.. ఇంగ్లండ్ ఐదు సార్లు చేసింది.

Story first published: Monday, July 15, 2024, 7:39 [IST]
Other articles published on Jul 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+