Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Euro 2024: ఉత్కంఠపోరులో విజయం.. క్వార్టర్స్ చేరిన ఫ్రాన్స్!

యురో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఫ్రాన్స్ క్వార్టర్స్ చేరింది. సోమవారం అర్థరాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై గెలుపొందింది. బెల్జియం డిఫెండర్ జాన్ వెర్టోంఘెన్ చేసిన ఘోర తప్పిదం ఫ్రాన్స్‌కు కలిసొచ్చింది. మరో 5 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా జాన వెర్టోంఘెన్ సెల్ఫ్ గోల్ చేశాడు.

ఫ్రాన్స్ ప్లేయర్ రాండల్ కోలో మువానిని తప్పించే ప్రయత్నంలో జాన్‌ వెర్టోంఘన్ బంతిని తమ గోల్‌ పోస్ట్‌లోకి పంపించాడు. దాంతో ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బెల్జియం ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఆటను 3 నిమిషాలను పొడిగించినా ఫలితం మారలేదు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్.. పోర్చుగల్ వర్సెస్ స్లోవెనియా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడనుంది.

Euro 2024 France Register Narrow Win Over Belgium To Reach Quarterfinals

క్వార్టర్స్‌లో ఇంగ్లండ్, స్పెయిన్
ఇంగ్లండ్, స్పెయిన్‌లు కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్‌ సాధించిన ఇంగ్లండ్ తృటిలో ఓటమి నుంచి గట్టెక్కింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో స్లోవేకియాపై విజయం సాధించింది. బెల్లింగ్ హమ్(90+5వ నిమిషం), హ్యారీ కేన్(91వ నిమిషం) గోల్స్ సాధించి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు.

స్లోవేకియా తరఫున షురాంజ్(25వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు. నిర్ణీత సమయంలో ఇంగ్లండ్ 0-1తో వెనుకంజలో నిలిచింది. స్టాపేజ్ సమయంలో బెల్లింగ్‌హమ్ తలతో అద్భుతంగా గోల్ చేసి ఇంగ్లండ్‌ను రేసులో నిలబెట్టాడు.

గోల్స్ సమం కావడంతో ఫలితం తేల్చేందుకు అదనపు సమయాన్ని కేటాయించగా... స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ గోల్ చేసి జట్టు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో స్పెయిన్ 4-1తో జార్జియాను ఓడించింది. రోడ్రి(39వ నిమిషయం), ఫాబియన్(51వ నిమిషం), విలియమ్స్(75వ నిమిషం), ఒల్మో(83వ నిమిషం) స్పెయిన్ తరఫున చెరో గోల్ నమోదు చేశారు.

Story first published: Tuesday, July 2, 2024, 8:52 [IST]
Other articles published on Jul 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+