Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Euro 2020: ఫ్రాన్స్‌ షూటౌట్‌.. జర్మనీకి ఝలక్‌.. క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌, ఇంగ్లండ్‌!

 Euro 2020: Switzerland beats France 5-4 in penalty shootout, England knock Germany out

బుకారెస్ట్‌ (రొమేనియా): యూరో కప్‌ 2020 ఫుట్‌బాల్‌ టోర్నీలో సంచలన ఫలితాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ పోర్చుగల్‌ ఓటమి మరువక ముందే ఈసారి ఏకంగా ఫిఫా ప్రపంచ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో పాటు జర్మనీకి కూడా నిరాశే ఎదురైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ 'పెనాల్టీ షూటౌట్‌'లో 5-4తో ఫ్రాన్స్‌ జట్టును ఓడించి యూరో టోర్నీలో తొలిసారిగా క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

జట్టులో ఎంతోమంది స్టార్‌ ఆటగాళ్లు... అంతర్జాతీయ టోర్నీలలో ఎన్నో గొప్ప విజయాలు... అయితేనేం తప్పిదాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, యూరో కప్‌ రన్నరప్‌ ఫ్రాన్స్‌ జట్టు విషయంలో ఇలాగే జరిగింది. యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ కథ అనవసర తప్పిదాలతో చివరకు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది.

సమంగా నిలవడంతో..

సమంగా నిలవడంతో..

నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. స్విట్జర్లాండ్‌ తరఫున సెఫరోవిచ్‌ (15వ, 81వ ని.లో) రెండు గోల్స్‌... గావ్రనోవిచ్‌ (90వ ని.లో) ఒక గోల్‌ చేశారు. ఫ్రాన్స్‌ జట్టుకు కరీమ్‌ బెంజెమా (57వ, 59వ ని.లో) రెండు గోల్స్‌... పోగ్బా (75వ ని.లో) ఒక గోల్‌ అందించారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి 'పెనాల్టీ షూటౌట్‌'ను నిర్వహించారు.

 కొంపముంచిన ఎంబాపె

కొంపముంచిన ఎంబాపె

మొదట స్విస్‌ ఆటగాళ్లు ఎలాంటి తడబాటు లేకుండా ఐదు పెనాల్టీ కిక్‌లను గోల్స్‌గా మలిచారు. అటు ఫ్రాన్స్‌ తొలి నాలుగు కిక్‌లను గోల్‌ పోస్టులోకి పంపడంతో ఇక ఫైనల్‌ పెనాల్టీపై అందరికీ ఉత్కంఠ నెలకొంది. దీన్ని స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపె సంధించగా స్విస్‌ గోల్‌ కీపర్‌ యాన్‌ సోమర్‌ కుడివైపునకు డైవ్‌ చేస్తూ అద్భుత రీతిలో అడ్డుకోవడంతో ఫ్రాన్స్‌కు దిమ్మ తిరిగింది. అటు స్విస్‌ సంబరాల్లో మునిగిపోయింది.

 29 ఏళ్ల తర్వాత..

29 ఏళ్ల తర్వాత..

1992 తర్వాత ఫ్రాన్స్‌ జట్టుపై స్విట్జర్లాండ్‌ నెగ్గడం ఇదే తొలిసారి. యూరో టోర్నీలో ఏనాడూ స్విట్జర్లాండ్‌ చేతిలో ఓడిపోని ఫ్రాన్స్‌కు ఈసారీ విజయం దక్కేది. కానీ చివరి 10 నిమిషాల్లో అలసత్వం ఫ్రాన్స్‌ కొంపముంచింది. ఫ్రాన్స్‌ రక్షణశ్రేణిలోని లోపాలను సద్వినియోగం చేసుకొని స్విట్జర్లాండ్‌ చివరి పది నిమిషాల్లో రెండు గోల్స్‌ చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదనపు సమయంలో ఫ్రాన్స్‌ను నిలువరించి... షూటౌట్‌లో ఆ జట్టును నాకౌట్‌ చేసింది.

జర్మనీకి ఝలక్‌

జర్మనీకి ఝలక్‌

లండన్‌లో మంగళవారం జరిగిన మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ 2-0 గోల్స్‌ తేడాతో మూడుసార్లు చాంపియన్‌ అయిన జర్మనీ జట్టును ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్‌ తరఫున స్టెర్లింగ్‌ (75వ ని.లో), హ్యారీ కేన్‌ (86వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఓ మేజర్‌ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో జర్మనీ ఓడడం ఇదే తొలిసారి. మరో ప్రీక్వార్టర్స్‌ లో స్పెయిన్‌ 5-3 తేడాతో ఉక్రెయిన్‌ని చిత్తు చేసింది.

Story first published: Wednesday, June 30, 2021, 8:15 [IST]
Other articles published on Jun 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+