Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

EURO 2020: బెల్జియంకు షాక్.. స్విట్జర్లాండ్ షూటౌట్.. సెమీస్‌లో స్పెయిన్, ఇటలీ!

EURO 2020: Spain Beat Switzerland 3-1 on Penalties and Italy beat Belgium 2-1, reach semifinals

సెయింట్‌పీటర్స్‌బర్గ్‌: యూరో కప్‌ 2020లో త్రీ టైమ్ చాంపియన్ స్పెయిన్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఆ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-1తో స్విట్జర్లాండ్‌పై విజయం సాధించింది. ఉత్కంఠతో ఊపేసిన ఈ మ్యాచ్‌లో స్విస్‌ జట్టు ఓడినప్పటికీ.. తన కంటే మెరుగైన స్పెయిన్‌ను గొప్పగా నిలువరించింది.

ఆట 8వ నిమిషంలో స్విస్‌ ఆటగాడు డెనిస్‌ జకారియా సెల్ఫ్ గోల్‌‌తో స్పెయిన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. 68వ నిమిషంలో షాఖిరి గోల్‌తో స్విట్జర్లాండ్‌ స్కోరు సమం చేసింది. నిర్ణీత 90 నిమిషాలు, అదనపు 30 నిమిషాల్లో ఇరు జట్లు మరో గోల్‌ నమోదు చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. షూటౌట్‌లో స్పెయిన్‌ తొలి ప్రయత్నాన్నే సోమర్‌ ఆపగా.. స్విస్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ తర్వాతి మూడు ప్రయత్నాల్లోనూ ఆ జట్టు విఫలమైంది. ఒయర్జబాల్‌ కొట్టిన గోల్‌తో స్పెయిన్‌ విజయం పూర్తయింది.

మరో క్వార్టర్ ఫైనల్లో ఇటలీ 2-1 తేడాతో బెల్జియంను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. యూరో కప్ 2020 తుది అంకానికి చేరుకున్నది. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఇటలీ జట్టు బెల్జియంను ఓడించి సెమీఫైనల్ చేరుకున్నది. ఇటలీ తరఫున నికొలో బారెల్లా(31వ నిమిషం), లోరెంజో ఇన్‌సిగ్నే(44వ నిమిషం) చెరొక గోల్ చేయగా.. బెల్జియం తరఫున నమోదైన ఏకైక గోల్‌ను రోమెలు లుకాకు(45+2 నిమిషం) అందించాడు. సెమీస్‌లో ఇటలీ-స్పెయిన్ తలపడనున్నాయి. ఇటీవల కాలంలో బెల్జియం క్వార్టర్స్‌లో వెనుదిరగడం ఇది రెండో సారి. నేడు(శనివారం) జరిగే మరో క్వార్టర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్, డెన్మార్క్ తలపడనుండగా.. ఆదివారం జరిగే క్వార్టర్స్‌లో ఉక్రెయిన్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Story first published: Saturday, July 3, 2021, 9:36 [IST]
Other articles published on Jul 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+