For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజానికి అత్యున్నత పురస్కారం!

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెకమ్‌‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లండ్ అత్యున్నత పురస్కారమైన నైట్‌హుడ్(సర్) హోదా లభించింది. ఇంగ్లండ్ కింగ్ చార్లెస్ 3 చేతుల మీదుగా మంగళవారం డేవిడ్ బెకమ్ ఈ అరుదైన గౌరవాన్ని స్వీకరించారు. విండర్స్ క్యాజిల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కింగ్ చార్లెస్-3 కత్తి అంచుతో డేవిడ్ బెకమ్ భుజాలను టచ్ చేశారు. దాంతో బెకమ్ మోకాళ్లపై కూర్చొని ఈ గౌరవాన్ని అందుకున్నారు. బెకమ్‌ గోల్ చేసిన అనంతరం ఇలానే మోకాళ్లపై కూర్చొని సంబరాలు చేసుకునేవారు. అదే సెలెబ్రేషన్‌ను రిపీట్ చేశారు.

ఇక నుంచి సర్ బెకమ్..

ఈ అరుదైన గౌరవంతో ఇక నుంచి డేవిడ్ బెకమ్‌‌ను సర్ బెకమ్ అని పిలుస్తారు. ఇంగ్లండ్ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడంపై బెకమ్ సంతోషం వ్యక్తం చేశారు. 'నిస్సందేహంగా ఇది నాకు అత్యంత గర్వకారణమైన క్షణం. నా కెరీర్‌లో నేను ఆశించిన ఫలితాన్ని అందుకున్నాను. అందుకు నేను అదృష్టంతుడిని. అయితే నైట్ హుడ్ వంటి గౌరవాన్ని అందుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ గౌరవం దక్కడం నిజంగా అద్భుతమే.'అని బెకమ్ ఉప్పొంగిపోయారు.

England Football Legend David Beckham Receives Knighthood for His Contribution to the Sport

50 ఏళ్ల బెకమ్ ఫుట్‌బాల్‌‌లో దేశం తరఫున రాణించడంతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలతో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం దక్కింది. ఆయన గత రెండు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితితో కలిసి యూఎన్‌ఎస్ చిల్డ్రన్స్ ఫండ్‌ కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా మలేరియా నిర్మూలనకు కృషి చేశారు. 2012లో లండర్ ఒలింపిక్స్ నిర్వహణ హక్కులను దక్కించుకోవడంలోనూ బెకమ్ కీలక పాత్ర పోషించారు.

ఏకైక ఇంగ్లండ్ ప్లేయర్..

మూడు వేర్వేరు ప్రపంచకప్‌ల్లో గోల్ చేసిన ఏకైక ఇంగ్లీష్ సాకర్ ఆటగాడిగా బెకమ్ రికార్డ్ సాధించాడు. 1999లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు సాధించిన ప్రిమియర్ లీగ్, ఎఫ్‌ఏ కప్, ఛాంపియన్స్ లీగ్ విజయాల్లో బెకమ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ తరఫున 115 మ్యాచ్‌లు ఆడిన బెకమ్.. 59 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ఆల్‌టైమ్ లిస్ట్‌లో బెకమ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

2003లో మాంచెస్టర్ యునైటెడ్‌ జట్టు నుంచి తప్పుకున్న తర్వాత రియల్ మాడ్రిడ్, లాస్ ఏంజిల్స్ గెలాక్సీ, పారిస్ సెయింట్-జర్మైన్ జట్లకు ఆడాడు. ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్ జట్టు ఇంటర్ మయామికి కో ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు

అత్యంత వివాదాస్పదం..

1998 ప్రపంచకప్‌ బెకమ్ కెరీర్‌లో ఓ పీడ కలగా మిగిలింది. ఈ టోర్నీలో అర్జెంటీనా ప్లేయర్ డియోగో సియోన్‌ను బెకమ్ ఉద్దేశపూర్వకంగా తన్నాడని ఆయనను మైదానం నుంచి బయటకు పంపేసారు. ఆ టోర్నీలో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఈ ఓటమికి బెకమ్ కారణమని ఫ్యాన్స్ అప్పట్లో ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టారు. భారత రత్న తరహాలోనే ఇంగ్లండ్‌లో నైట్ హుడ్ అత్యున్నత పురస్కారం.

Story first published: Wednesday, November 5, 2025, 13:16 [IST]
Other articles published on Nov 5, 2025
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+