ఉత్కంఠ క్షణాల కోసం ఎదురుచూపు: షెఫీల్డ్ ఇళ్లపై ఇంగ్లాండ్ జాతీయ జెండా రెపరెపలు

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో రెండో సెమీఫైనల్ సమరానికి అంతా సిద్ధమైంది. టోర్నీలో భాగంగా బుధవారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో క్రొయేషియా జట్టు తలపడనుంది. 1990 తర్వాత ఇంగ్లాండ్‌కు ఇదే తొలి సెమీస్ కాగా.. క్రొయేషియాకు మొత్తంగా ఇది రెండోది కావడం విశేషం.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
తొలిసారిగా 1966లో చాంపియన్ అయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత అత్యుత్తమంగా 1990లో సెమీస్‌కు చేరింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు మరోసారి టాప్-4లో చోటు దక్కించుకుంది. దీంతో ఉత్తర ఇంగ్లాండ్ షెఫీల్డ్ ఇళ్లపై ఇంగ్లాండ్ జాతీయ జెండాలు వందలాదిగా రెపరెపలాడుతున్నాయ.

ఇంగ్లాండ్ షెఫీల్డ్ ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలు
ఇందుకు ఓ ప్రధాన కారణం ఉంది. క్రొయేషియాను ఎదుర్కోబోతున్న ఇంగ్లాండ్ జట్టులోని కిలె వాకర్, హ్యారీ మాగురీ, జామి వర్డీలు పుట్టిపెరిగింది ఇక్కడే. దీంతో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ విజయం సాధించాలని కోరుకుంటూ ఇళ్లపై జెండాలను ఆవిష్కరింపచేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఎక్కడ చూసిన ఫిఫా ఫీవరే. ఎందుకంటే ఆ జట్టు ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేస్తే చారిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతం కానుంది. విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుతుంది.

సెమీస్ ఉత్కంఠ క్షణాల కోసం ఎదురుచూస్తోన్న లండన్‌వాసులు
దీంతో సెమీస్ ఉత్కంఠ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. స్వీడన్‌పై విజయంతో జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్ గెరెత్ సౌత్‌గేట్‌ను హీరోగా ప్రశంసిస్తున్నారు. సెమీఫైనల్ జరిగే జూలై 11న ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదని స్వచ్ఛందంగా తీర్మానించుకున్నారు. ఇప్పటికే పన్నెండేళ్ల కలను సాకారం చేసుకుని సెమీస్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్ 1966 తర్వాత మళ్లీ ఛాంపియన్‌గా అవతరించాలని ఊవిళ్లూరుతోంది.

‘కల నెరవేరబోతోంది' అంటూ పత్రికల్లో వార్తలు
వరల్డ్ కప్‌ను ముద్దాడాలని లండనీయులు ఏర్పాట్లు చేసుకున్నారు. ‘కల నెరవేరబోతోంది' అంటూ పత్రికలు పతాక శీర్షికలు రాస్తుంటే, ‘వీడూ కథానాయకుడు' అంటూ గోల్‌కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్‌ను ఛానెల్స్ ఇప్పటికే ఆకాశానికి ఎత్తేసాయ. స్వీడన్‌పై ఇంగ్లాండ్ విజయాన్ని 32 మిలియన్ల మంది టీవీల్లో చూసినట్టు పత్రికలు కథనాలు రాసుకొచ్చాయి.

ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరడం ఖాయం
1990లో ఇంగ్లాండ్ జట్టును ఫైనల్‌కు తీసుకొచ్చిన అప్పటి కోచ్ బాబీ రాబ్‌సన్‌తో గెరెత్ సౌత్‌గేట్‌ను పోలుస్తూ, ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరడం ఖాయమన్న ఆనందాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ముఖాముఖిలో ఇంగ్లాండ్‌దే పైచేయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో క్రొయేషియాతో ఏడుసార్లు తలపడ్డ ఇంగ్లాండ్... నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిసారి 2009లో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు ఎదురుపడలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications