ఆస్ట్రేలియా ఖేల్ ఖతమ్.. ప్రపంచకప్ నుంచి ఔట్!
ఈజిప్ట్ ఫుట్‌బాల్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే తొలి సారి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం తెల్లవారుజామున జరిగిన నాకౌట్ పోరులో ఈజిప్ట్ 4-2 తేడాతో పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది.
ఈ పరాజయంతో ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో ఎక్స్‌ట్రా టైమ్ ఆడించాల్సి వచ్చింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది.
ఫస్టాఫ్‌లో ఈజిప్ట్ హవా..
మ్యాచ్ ప్రారంభమైన 13వ నిమిషంలోనే ఈజిప్ట్ గోల్స్ ఖాతా తెరిచింది. కరీమ్ హఫీజ్ అందించిన అద్భుత పాస్‌ను వింగర్ ఇమామ్ అషూర్ డౌన్‌వర్డ్ హెడర్‌తో గోల్‌గా మలిచి జట్టుకు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా గోల్ నమోదు కాలేదు. అయితే సెకండాఫ్ ప్రారంభంలోనే ఈజిప్ట్ స్టార్ ఓమర్ మర్మూష్ గోల్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

సెల్ఫ్ గోల్‌తో ఆస్ట్రేలియా కంబ్యాక్..
ఈజిప్ట్ తప్పిదాలను ఆస్ట్రేలియా అందిపుచ్చుకుంది. 55వ నిమిషంలో ఆస్ట్రేలియా ప్లేయర్ ఐడెన్ ఓ నీల్ ఫ్రీ-కిక్‌ను క్లియర్ చేసే క్రమంలో ఈజిప్ట్ డిఫెండర్ మహ్మద్ హనీ బంతిని తన సొంత నెట్‌లోకి పంపాడు. ఈ సెల్ఫ్ గోల్‌తో ఆస్ట్రేలియా 1-1తో స్కోరును సమం చేసింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో హనీకి ఇది రెండో సెల్ఫ్ గోల్ కావడం గమనార్హం.
మెరిసిన సలా..
నిర్ణీత సమయం, ఎక్స్‌ట్రా టైమ్‌లో స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా కొన్ని అద్భుతమైన అవకాశాలను సృష్టించినప్పటికీ గోల్స్ రాలేదు. దాంతో మ్యాచ్ ఫలితం తేలలేదు. దాంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది.
షూటౌట్ కోసం ఆస్ట్రేలియా తమ సీనియర్ గోల్ కీపర్ మాట్ ర్యాన్‌ను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. షూటౌట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు హ్యారీ సౌటర్, లూకాస్ హెరింగ్టన్ తమ పెనాల్టీలను మిస్ చేయగా.. ఈజిప్ట్ తరపున మహ్మద్ సలాతో సహా నలుగురు ఆటగాళ్లు ఎలాంటి తప్పులు చేయకుండా బంతిని నెట్‌లోకి పంపారు.
అర్జెంటీనాతో ఢీ..
చివరగా అబ్దెల్ మాజిద్ కూల్‌గా గోల్ కొట్టి ఈజిప్ట్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో పెనాల్టీ షూటౌట్ గెలిచిన రెండో ఆఫ్రికన్ దేశంగా ఈజిప్ట్ రికార్డు సృష్టించింది. ఈజిప్ట్ కన్నా ముందు మొరాకో ఈ ఫీట్ సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్.. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

