Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ నమూనాలను ఇలా కూడా వాడుతున్నారు!

Drug traffickers are using World Cup merchandise to smuggle cocaine

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ అంటే ఆ క్రేజే వేరు. అందుకు తగ్గట్లుగానే రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నాయి. వరల్డ్ కప్ జరిగే సమయంలో వరల్డ్ కప్ నమూనా కూడా ఎంతో ప్రత్యేకం. అలాంటి వరల్డ్ కప్ నమూనాల్లో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అర్జెంటీనా పోలీసులు పట్టుకున్నారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

గంజాయి, కొకైన్, క్రాక్ కొకైన్‌లతో పాటు వేలాది డాలర్లు నింపిన జూల్స్ రిమెట్ ట్రోఫీల నమూనాలను బ్యూనస్ ఎయిర్స్ రక్షణ మంత్రి క్రిస్టీన్ రిటోండో తన ట్వీటర్లో పోస్టు చేశారు. ''నార్కోస్ డీ లా కోపా''గా పిలిచే ఈ ముఠా సభ్యులు వరల్డ్ కప్ నమూనాల్లోకి 10 కిలోల కొకైన్ నింపారని స్థానిక మీడియా ఓ కథనంలో పేర్కొంది.

ఈ వరల్డ్ కప్ నమూనాల్లో మొత్తం 2 కిలో గంజాయి, 1800 డోసుల క్రాక్ కొకైన్, 15 వేల డాలర్లను కూడా తరలిస్తున్నట్టు అందులో రాసుకొచ్చింది. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు మరో నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులతో పాటు డ్రగ్స్ రవాణాకు వినియోగిస్తున్న రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Story first published: Tuesday, June 26, 2018, 17:37 [IST]
Other articles published on Jun 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+