దేశంలో అడుగుపెట్టలేవు: కోచ్‌కి వార్నింగ్ ఇచ్చిన పుట్‌బాల్ దిగ్గజం

హైదరాబాద్: అర్జెంటీనా జట్టు కోచ్ సంఫౌలీ తిరిగి స్వదేశానికి వచ్చే ఆశల్ని వదులుకోవాలంటూ పుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా హెచ్చరించాడు. ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గ్రూప్-డి నుంచి శనివారం స్పార్టాక్ స్టేడియంలో అర్జెంటీనా-ఐస్‌ల్యాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఆట ముగిసే సమయానికి 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలిసారి ఫిఫా వరల్డ్ కప్ ఆడుతున్న అతిచిన్న దేశమైన ఐస్‌ల్యాండ్ జట్టు, ఈ వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా ఉన్న అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చింది.
దీనిపై అర్జెంటీనా పుట్‌బాల్ దిగ్గజం, మాజీ కోచ్ డీగో మారడోనా అర్జెంటీనా ప్రస్తుత కోచ్ జార్జ్ సంపౌలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన జట్టు తొలి మ్యాచ్ ఆడుతున్న ఐస్‌ల్యాండ్‌తో డ్రాగా ముగించడమేంటని మండిపడ్డాడు. దీనికి పూర్తి బాధ్యత కోచ్‌దేనన్నాడు.

అర్జెంటీనా కోచ్ సంఫౌలీకి వార్నింగ్ ఇచ్చిన మారడోనా
ఇలా అయితే కోచ్ సంఫౌలీ తిరిగి స్వదేశానికి వచ్చే ఆశల్ని వదులుకోవాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా మారడోనా మాట్లడుతూ "పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని దిగ్గజ ఆటగాడు మెస్సీ గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. మెస్సీ పెనాల్టీతో కలుపుని అర్జెంటీనా రెండు పాయింట్లు సాధించే అవకాశాన్ని కోల్పోయిందని నేను అనుకోవడం లేదు" అని అన్నాడు.

కోచ్ ప్రణాళికలు సరిగా లేవు
"తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన పసికూన ఐస్ ల్యాండ్‌తో అర్జెంటీనా ఆటగాళ్లు ఆడిన తీరును కూడా నేను నిందించను. అర్జెంటీనా గెలవకపోవడానికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకపోవడమే. కోచ్ ప్రణాళికలు సరిగా లేవు. వీరి ప్రదర్శన ఇలాగే కొనసాగితే కోచ్ సంపౌలీ దేశంలో అడుగుపెట్టలేవు. కుటుంబాన్ని మార్చడానికి ఏదైనా దేశం వెతుక్కోవాలి" అని మారడోనా వార్నింగ్ ఇచ్చాడు.

19వ నిమిషంలో తొలి గోల్ నమోదు చేసిన అర్జెంటీనా
ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా తొలి అర్ధభాగంలో 19వ నిమిషంలో తొలి గోల్ నమోదు చేసింది. దీంతో అర్జెంటీనా శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. అయితే, ఆ సంబరాన్ని ఎంతోసేపూ నిలవనివ్వకుండా 23వ నిమిషంలో ఐస్‌ల్యాండ్ ఆటగాడు ఫిఫ్ బొగాసన్ మెరుపు గోల్‌తో స్కోర్ సమం చేశాడు.

రెండు గోల్స్ కూడా ఆట తొలి అర్ధభాగంలోనే నమోదు
ఈ రెండు గోల్స్ కూడా ఆట తొలి అర్ధభాగంలోనే నమోదయ్యాయి. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాద్యపడలేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 7సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడింది. కాగా, ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో పొగ తాగిన మారడోనా ఫిఫా యాజమాన్యం ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications