Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌గా ఫ్రీగా పనిచేస్తా: అర్జెంటీనా ఓటమితో మారడోనా బంఫర్ ఆఫర్

Diego Maradona offers to coach Argentina for free after World Cup debacle

హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఉచితంగా పనిచేస్తానని దిగ్గజ పుట్‌బాలర్ డిగో మారడోనా వెల్లడించాడు. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మెగా టోర్నీలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టు ఇంటిదారి పట్టింది. ప్రతిష్టాత్మకంగా భావించే వరల్డ్ కప్ లాంటి టోర్నీలో అర్జెంటీనా లేకపోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

టోర్నీలో భాగంగా కజన్ వేదికగా ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో 4-3తేడాతో అర్జెంటీనా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం 'హ్యాండ్ ఆప్ గాండ్' అనే టెలివిజన్ షోలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా మాట్లాడుతూ అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఉచితంగా పనిచేస్తానని తెలిపాడు.

"డబ్బులు తీసుకోకుండానే అర్జెంటీనా జట్టు కోచ్‌గా పనిచేస్తా" అని అన్నాడు. అర్జెంటీనా జట్టు ప్రస్తుత కోచ్ జార్జ్ సంపోలీ కాంట్రాక్టు 2022 వరకు ఉన్నప్పటికీ.. ఆ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు గాను "అవును, నేను ఉచితంగానే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తా. తిరిగి వచ్చే క్రమంలో నేను ఏమీ ఆశించను" అని అన్నాడు.

"చాలా మంది అనుకుంటున్నారు నేను చాలా సంతోషంగా ఉన్నానని, కానీ నా హృదయం బాధతో బరువుగా ఉంది" అని అర్జెంటీనా టోర్నీ నుంచి నిష్క్రమించిన సందర్భంలో మారడోనా ఈ వ్యాఖ్యలు చేశాడు. 2008 నుంచి 2010 వరకు మారడోనా అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలోని అర్జెంటీనా 2010 వరల్డ్‌కప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది.

Story first published: Wednesday, July 4, 2018, 12:31 [IST]
Other articles published on Jul 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+